Bhavina Patel: ‘భవీనా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చరిత్ర లిఖించావ్‌’

పారాలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు రజత పతకం అందించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్‌ పటేల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ భవీనా పటేల్‌కు ట్విటర్‌ ద్వారా అభినందనలు

Updated : 29 Aug 2021 12:39 IST

టోక్యో: పారాలింపిక్స్‌ టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు రజత పతకం అందించి చరిత్ర సృష్టించిన భవీనాబెన్‌ పటేల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ భవీనా పటేల్‌కు ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

‘పారాలింపిక్స్‌లో రజతం సాధించి భారత బృందానికి, క్రీడా ప్రేమికులకు భవీనా స్ఫూర్తినిస్తోంది. ఆమె అసాధారణమైన సంకల్పం, నైపుణ్యాలు దేశానికి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఈ అసామాన్యమైన విజయం సాధించిన భవీనాకు అభినందనలు’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ట్వీట్‌ చేశారు.

‘భవీనా పటేల్‌కు అభినందనలు. ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చరిత్ర లిఖించావ్‌. దేశానికి చరిత్రాత్మక రజత పతకం తీసుకొస్తున్నావు. నీ జీవిత ప్రయాణం ఇతరులకు ప్రేరణగా నిలవడమే కాకుండా యువతను క్రీడల వైపు ఆకర్షితులను చేస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

‘పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించినందుకు భవీనా పటేల్‌కు అభినందనలు. మీ విజయాన్ని దేశం ప్రశంసిస్తోంది. మీరు దేశం గర్వపడేలా చేశారు’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశారు.

వీరితో పాటు భారత మహిళా రెజ్లర్ గీత ఫొగాట్‌, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అభినవ్‌ బింద్రా, భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ భవీనాకు ట్విటర్‌ ద్వారా అభినందలు తెలిపారు.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని