Published : 22/11/2021 14:31 IST

Peng Shuai: పెంగ్‌ షువాయి క్షేమంగా ఉంది.. త్వరలోనే బయటకు వస్తుంది: ఐఓసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్ది రోజులుగా కనపడకుండాపోయిన చైనా టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి క్షేమంగా ఉన్నారని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) స్పష్టం చేసింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో ఆమె ఆదివారం వీడియోకాల్‌లో మాట్లాడారని చెప్పింది. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఓ ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి జాంగ్‌ గవోలి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పెంగ్‌ ఈనెల 2న తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆమె ఎవరికీ కనిపించకుండా పోయింది.

ఈ క్రమంలోనే పెంగ్‌ భద్రతపై పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగగా.. టెన్నిస్‌ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించి స్పందించారు. తాజాగా తాను క్షేమంగా ఉన్నట్లు బాచ్‌తో పెంగ్‌ తెలిపినట్లు ఐఓసీ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. తన యోగక్షేమాలు తెలుసుకున్నందుకు ఈ సందర్భంగా ఆమె థామస్‌కు కృతజ్ఞతలు తెలిపారని చెప్పింది. బీజింగ్‌లోని తన ఇంట్లోనే క్షేమంగా ఉన్నానని.. ప్రస్తుత పరిస్థితుల్లో తన భద్రత రీత్యా ఇక్కడే ఉండాలనుకున్నట్లు ఆమె వెల్లడించిందని పేర్కొంది. అయితే, త్వరలోనే పెంగ్‌ టెన్నిస్‌ ఆడుతుందని కూడా ఐఓసీ స్పష్టం చేసింది.

అంతకుముందు పెంగ్‌ ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. అక్కడి సీజీటీఎన్‌ ఛానల్‌ ఉద్యోగి షెన్‌ షీవీ.. పెంగ్‌ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది. వీచాట్‌ అనే సామాజిక మాధ్యమంలో పెంగ్‌ స్వయంగా ఈ ఫొటోలు పోస్టు చేసిందని ఆయన ట్వీట్‌లో తెలిపాడు. అక్కడి అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రచురించే ఆంగ్ల పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ హూ జిజిన్‌ సైతం.. ‘‘అనధికార సమాచారం ప్రకారం ఈ ఫొటోలు పెంగ్‌ ప్రస్తుత పరిస్థితిని తెలుపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె తన సొంత ఇంట్లోనే స్వేచ్ఛగా ఉంది. తనకెలాంటి ఆటంకం కలగకూడదని అనుకుంటోంది. త్వరలోనే ఆమె బయటకు వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంది’’ అని పేర్కొన్నారు. కానీ, ఈ వార్తలను ప్రజలు విశ్వసించలేదు. ఈ నేపథ్యంలోనే పెంగ్‌ ఐఓసీ ముందుకొచ్చి తాను క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు.

Read latest Sports News and Telugu News

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని