IPL - RCB: నెవర్‌ గివప్‌... స్టెప్పులతో అదరగొట్టిన ఆర్‌సీబీ ఆటగాళ్లు

‘నెవర్‌ గివప్‌’ పేరిట ఐపీఎల్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ రూపొందించిన మ్యూజిక్‌ వీడియో ఉర్రూతలూగిస్తోంది. ఆర్‌సీబీ క్రికెటర్లు స్టెప్పులతో అదరగొట్టిన ఈ వీడియోను.......

Updated : 07 Dec 2022 22:05 IST

బెంగళూరు: ‘నెవర్‌ గివప్‌... డోంట్‌ బ్యాక్‌ డౌన్‌...’ అంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ రూపొందించిన మ్యూజిక్‌ వీడియో సోషల్‌ మీడియాలో ఉర్రూతలూగిస్తోంది. జట్టు థీమ్‌ను, సభ్యుల దృక్పథాన్ని, క్రికెట్‌ను వారు ఆరాధిస్తున్న విధానాన్ని తెలిపేలా ఈ పాటను రూపొందించారు. ఆర్‌సీబీ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, దేవదత్‌ పడిక్కల్‌, యుజ్వేంద్ర చాహల్‌, నవదీప్‌ సైనీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్‌ సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, కైల్‌ జేమీసన్‌ తదితరులు పాటలో తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియోను విరాట్ కోహ్లి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ ‘ఓటమికి ఎప్పుడూ తలవంచొద్దు. పోరులో వెనుకబడిపోవద్దు...’ అని రాసుకొచ్చాడు. ఈ మ్యూజిక్‌ వీడియోకు క్రికెటర్‌ యజువేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ వర్మ డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించడం విశేషం. ఇటీవల దుబాయిలో ఐపీఎల్‌ జరిగిన సమయంలో ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది. 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు