IND vs ENG: ఈ ఓటమి చికాకు తెప్పించింది: జోరూట్

టీమ్‌ఇండియాతో ఆడిన నాలుగో టెస్టులో ఓటమిపాలవ్వడం చికాకు తెప్పించిందని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ అన్నాడు. ఈ వైఫల్యం నుంచి తమ జట్టంతా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉందన్నాడు...

Updated : 07 Sep 2021 08:21 IST

లండన్‌: టీమ్‌ఇండియాతో ఆడిన నాలుగో టెస్టులో ఓటమిపాలవ్వడం చికాకు తెప్పించిందని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ అన్నాడు. ఈ వైఫల్యం నుంచి తమ జట్టంతా ఎంతో కొంత నేర్చుకోవాల్సింది ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశమున్నా ఓటమిపాలయ్యామని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు శుభారంభం చేసినా టీమ్‌ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించారని అన్నాడు. వాళ్లు రివర్స్‌స్వింగ్‌తో తమ ఆట కట్టించారని ఇంగ్లాండ్‌ సారథి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ రూట్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు, రెండో సెషన్‌లో అతడు వరుస ఓవర్లలో పోప్‌, బెయిర్‌స్టోలను పెవిలియన్‌ పంపి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతడు ప్రపంచ శ్రేణి బౌలర్‌. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అలాగే ఈ మ్యాచ్‌లో మేం ఎలాంటి తప్పులు చేశామో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో పాటు ఇతర అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది’ అని రూట్‌ పేర్కొన్నాడు. ఇక వచ్చేవారం జరిగే ఐదో టెస్టులో మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. మరోవైపు స్లిప్‌లో పలు క్యాచ్‌లు జారవిడ్చడంపై స్పందిస్తూ.. ఈ విషయంపై మరింత దృష్టిసారించాలని చెప్పాడు. చివరగా తమ బౌలర్లు గాయాలబారిన పడటం ఇబ్బందిగా మారిందని రూట్‌ వివరించాడు. అయినా తాము రాణిస్తామని, వచ్చేవారం జరిగే చివరి టెస్టులో మరింత బాగా ఆడతామని చెప్పాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని