Tokyo Olympics: జావెలిన్‌ త్రో ఫైనల్‌కు నీరజ్‌ చోప్రా.. నిరాశపరిచిన శివపాల్‌

ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు.

Updated : 04 Aug 2021 10:35 IST

టోక్యో: ఒలింపిక్స్‌ పురుషుల జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన నీరజ్‌ చోప్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. గ్రూప్‌-ఎ క్వాలిఫై రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 86.65 మీటర్లు విసిరాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫిన్లాండ్‌ అథ్లెట్‌ లస్సి ఇటెలాటాలో తర్వాతి స్థానంలో నీరజ్‌ చోప్రా నిలిచాడు. జావెలిన్‌ త్రో ఫైనల్‌ ఈనెల 7న జరగనుంది. 

మరోవైపు జావెలిన్‌ త్రోలో భారత్‌కు చెందిన మరో అథ్లెట్‌ శివ్‌పాల్ సింగ్‌ నిరాశపరిచాడు. గ్రూప్‌-బి క్వాలిఫై రౌండ్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని