IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై రాహుల్‌ ద్రవిడ్‌ ఏమన్నాడంటే?

టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడంతో నూతన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరూ బాగా ఆడారన్నాడు...

Updated : 22 Nov 2021 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌పై 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోవడంతో నూతన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరూ బాగా ఆడారన్నాడు. ఇదో అద్భుతమైన సిరీస్‌ విజయమని అభిప్రాయపడ్డాడు. ఇలా తొలి టోర్నీనే విజయంతో ఆరంభించడం సంతోషంగా ఉందన్నాడు. గతరాత్రి టీమ్‌ఇండియా కివీస్‌పై 73 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాక ద్రవిడ్‌ మాట్లాడాడు. ఈ విజయంతో పొంగిపోకుండా భారత ఆటగాళ్లు నేలపై ఉండాలన్నాడు. వాస్తవంగా న్యూజిలాండ్‌ బలమైన జట్టని, అది ఇటీవల పూర్తయిన ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడటం.. వారం రోజుల్లో మరో టీ20 సిరీస్‌ ఆడటం అంత తేలిక కాదన్నాడు. టీమ్‌ఇండియా గెలవడం బాగున్నా నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయన్నాడు.

‘వచ్చే ప్రపంచకప్‌ వరకూ సుదీర్ఘ ప్రయాణం ఉంది. అందులో గెలుపోటములు చూడాలి. ఈ సిరీస్‌లో పలువురు యువకులు అవకాశం దక్కించుకొని రాణించడం బాగుంది. ఇకపై వారికి మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సహించాలి. అలాగే ఇంకొంత మంది ఫామ్‌లోకి రావడంతో జట్టు బలంగా మారింది. యువకులు రాణించడం అనేది గొప్ప విషయం. దీంతో అందర్నీ కలిపి ఆడించవచ్చు. ఇక్కడి నుంచి వచ్చే ప్రపంచకప్‌ దాకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మరోవైపు నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు వీరిలో కొంత మంది యువకులే ఎంపికయ్యారు. వారిని ఇకపై కాస్త త్వరగా నిద్రపోమని చెప్తా. ఎందుకంటే టెస్టు మ్యాచ్‌లు ఉదయం 9:30కే ప్రారంభమవుతాయి. వారు.. 7:30 కల్లా మేలుకోవాలి’ అని ద్రవిడ్‌ సరదాగా చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని