India vs England: కఠినంగా అనిపించినా.. కోహ్లీసేన ఆస్ట్రేలియా బ్రాండ్‌ క్రికెట్‌ ఆడుతోంది!

కఠినంగా అనిపించినా.. టీమ్‌ఇండియా మాత్రం ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్‌ ఆడుతోందని ఇంగ్లాండ్‌ సహాయ కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ అంటున్నాడు. లార్డ్స్‌ టెస్టులో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయని పేర్కొన్నాడు....

Published : 01 Sep 2021 10:46 IST

లండన్‌: కఠినంగా అనిపించినా.. టీమ్‌ఇండియా మాత్రం ఆస్ట్రేలియా బ్రాండ్ క్రికెట్‌ ఆడుతోందని ఇంగ్లాండ్‌ సహాయ కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ అంటున్నాడు. లార్డ్స్‌ టెస్టులో రెండు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయని పేర్కొన్నాడు. కోహ్లీ అత్యంత భావోద్వేగంతో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడని వెల్లడించాడు. జో రూట్‌ ఇలాగే తన ఫామ్‌ కొనసాగిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

‘లార్డ్స్‌ టెస్టు నువ్వా నేనా అన్నట్టు సాగింది. రెండు జట్లు దాదాపుగా విజయానికి దగ్గరయ్యాయి. ఒక్క అవకాశాన్నీ కూడా వదిలేయొద్దన్నట్లు రెండు జట్లు పట్టుదల ప్రదర్శించాయి. ఎందుకంటే ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్నప్పుడు గెలుపు వారికి అత్యంత కీలకం. అందుకే ఈ మ్యాచ్‌ అద్భుతం. ఏదేమైనా మేం ఫలితానికి మరో వైపు నిలిచాం. కానీ, రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చెలాయించాయి’ అని కాలింగ్‌వుడ్‌ అన్నాడు.

‘ఆస్ట్రేలియా తరహా ప్రవర్తన, వారి క్రికెట్‌ కాలం గడిచే కొద్దీ మారుతున్నాయి. కాస్త కఠినంగా అనిపించినా టీమ్‌ఇండియా మాత్రం ఆస్ట్రేలియాలా కనిపిస్తోంది. విరాట్‌ అద్భుతమైన ఆటగాడు. ఎంతో భావోద్వేగంతో జట్టును నడుపుతున్నాడు. ఇంగ్లాండ్‌ జట్టుగా మేం మా నిర్ణయాలపై దృష్టిపెడతాం. భారత్‌ చేస్తున్న దానిపై, తీసుకుంటున్న నిర్ణయాలపై మేం దృష్టి నిలపం. వారి నిర్ణయాలు వారిష్టం. మేమేం తీసుకుంటామో అదే మాకు కీలకం. వాటిద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టడం అవసరం’ అని కాలింగ్‌వుడ్‌ తెలిపాడు.

‘మైదానంలో మేమెలా ప్రవర్తిస్తామన్నదే మాకు ముఖ్యం. కొన్ని సంక్లిష్ట నిర్ణయాలు తీసుకొని మేం టీమ్‌ఇండియాపై ఒత్తిడి పెంచాలని అనుకుంటున్నాం. మా పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ప్రతి సిరీసుకు సన్నద్ధమవుతాడు. అతడికి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆ వయసు వారికి వరుసగా మ్యాచులు ఆడటం కష్టమే. కానీ, అతడు మాత్రం సూపర్‌ ఫిట్‌గా ఉన్నాడు. ఇక జో రూట్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంతిని చక్కగా చూస్తూ ఆడుతున్నాడు. సిరీస్‌ సాంతం అతడిలాగే ఆడతాడని మా విశ్వాసం’ అని వుడ్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని