Published : 28/08/2021 02:08 IST

Chris Cairns: ప్రాణాపాయం తప్పినా విషమంగానే..! క్రిస్‌కెయిర్న్స్‌కు పక్షవాతం

మెల్‌బోర్న్‌: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్‌ క్రిస్‌ కెయిర్న్స్‌ కాళ్లు చచ్చుబడ్డాయని సమాచారం. అతడి గుండెకు శస్త్రచికిత్స చేసే సమయంలో వెన్నెముకలో స్ట్రోక్‌ రావడంతో పక్షవాతం వచ్చిందని తెలిసింది. ప్రస్తుతం అతడిని తన నివాస ప్రాంతమైన కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా)కు తరలించినా పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందని అంటున్నారు.

క్రిస్‌ కెయిర్న్స్‌ హృదయ రక్తనాళాల్లో ఒకచోట చీలిక రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాదాపుగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. కొన్నిరోజుల పాటు ఆస్పత్రిలో ప్రాణవాయువు సాయంతో ఉన్నాడు. సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో అతడికి ఈ మధ్యే శస్త్రచికిత్స చేశారు. ప్రాణానికి ముప్పు తప్పినా పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని తెలుస్తోంది.

‘సిడ్నీలోని ఆస్పత్రిలో క్రిస్‌ గుండెకు అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేశారు. కానీ, అదే సమయంలో అతడి వెన్నెముకలో స్ట్రోక్‌ వచ్చింది. ఫలితంగా రెండు కాళ్లు పక్షవాతానికి గురయ్యాయి’ అని కెయిర్న్స్‌ ప్రతినిధి ఆరోన్‌ లాయిడ్‌ మీడియాకు తెలిపారు. ‘ఇప్పుడు క్రిస్‌ను ఆస్ట్రేలియాలో వెన్నెముకకు సంబంధించిన ప్రత్యేక ఆస్పత్రికి తరలించాం. అక్కడే ఆయన కోలుకుంటారు’ అని ఆరోన్‌ వెల్లడించారు. కాగా తమకు అండగా నిలిచినందుకు, వ్యక్తిగోప్యతకు విలువిచ్చినందుకు కెయిర్న్స్‌ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

న్యూజిలాండ్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో క్రిస్‌ కెయిర్న్స్‌ ఒకరు. కెరీర్లో అతడు 62 టెస్టులు, 215 వన్డేలు, 2 టీ2ఏలు ఆడాడు. 1989లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి 2006లో వీడ్కోలు పలికాడు. 2000లో విజ్డెన్‌ అల్మానక్‌ క్రికెటర్ల జాబితాలో చోటు పొందాడు. 2008, ఐపీఎల్‌లో అతడిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు రాగా.. పోరాడి 2012లో లండన్‌ కోర్టులో నిర్దోషిగా నిరూపించుకున్నాడు. అంతేకాకుండా లలిత్‌ మోదీపై పరువునష్టం కేసులో విజయం సాధించాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని