Cricket News: షార్ట్‌పిచ్‌ బంతికి బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌ ఎగిరిపడింది

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ఓ బౌలర్‌ విసిరిన షార్ట్‌పిచ్‌ బంతి బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌కు బలంగా తగలడంతో అది ఎగిరికిందపడింది. అందుకు సంబంధించిన వీడియోను...

Updated : 16 Nov 2021 10:51 IST

(Photo: Cricket.com.au twitter video screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో ఓ బౌలర్‌ విసిరిన షార్ట్‌పిచ్‌ బంతి బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌కు బలంగా తగలడంతో అది ఎగిరికిందపడింది. అందుకు సంబంధించిన వీడియోను క్రికెట్‌.కామ్‌.ఏయూ అనే వెబ్‌సైట్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. మార్ష్ కప్‌లో భాగంగా తాజాగా క్వీన్స్‌లాండ్‌ బుల్స్‌, వెస్టర్న్‌ ఆస్ట్రేలియా జట్లు ఓ వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. క్వీన్స్‌లాండ్‌ ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌లో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జిమ్మీ పీర్సన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా కామెరూన్‌ గ్రీన్‌ బౌలింగ్‌కు వచ్చాడు.

అతడు వేసిన ఓ షార్ట్‌పిచ్‌ బంతి బ్యాటర్‌ హెల్మెట్‌కు బలంగా తగలడంతో అది ఎగిరికిందపడింది. వెంటనే ఇతర ఆటగాళ్లంతా ఆ బ్యాట్స్‌మన్‌ వద్దకొచ్చి అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జట్టు ఫిజియో కూడా పర్యవేక్షించి ప్రమాదం ఏమీ లేదని చెప్పాడు. అనంతరం ఆట కొనసాగించిన జిమ్మీ అర్ధశతకంతో రాణించాడు. అయినా ఆ జట్టు 70 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన వెస్టర్న్‌ ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసింది. కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ (124) శతకంతో మెరిశాడు. ఆపై క్వీన్స్‌లాండ్‌ 291 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్టర్న్‌ జట్టు విజయం సాధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని