Team India: కఠిన క్వారంటైన్‌లోకి భారత జట్లు

సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన నేపథ్యంలో టీమ్‌ఇండియా మహిళా, పురుషుల జట్లు మంగళవారం నుంచి కఠిన క్వారంటైన్‌ ప్రారంభించాయి. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో...

Updated : 25 May 2021 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటన నేపథ్యంలో టీమ్‌ఇండియా మహిళా, పురుషుల జట్లు మంగళవారం నుంచి కఠిన క్వారంటైన్‌ ప్రారంభించాయి. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో వారందరికీ ప్రత్యేకంగా బస ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే జూన్‌ 2న ఒక ఛార్టెడ్‌ విమానంలో అక్కడికి బయలుదేరనున్నారు. అయితే, అంతకుముందే క్రికెటర్లందరికీ మూడుసార్లు ఆర్టీ-పీసీఆర్‌ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిసింది.

కోహ్లీసేన జూన్‌ 18 నుంచి తొలుత న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడనుండగా, ఆపై ఆగస్టులో ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. మరోవైపు మహిళా జట్టు ఇంగ్లాండ్‌తోనే జూన్‌ 16 నుంచి ఒక టెస్టు ఆడిన తర్వాత మరో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో అనూహ్యంగా కరోనా బారిన పడి ఇటీవలే కోలుకున్న వృద్ధిమాన్‌ సాహా, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు రోజుల క్రితమే బయోబుడగలో చేరినట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. అలాగే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కోచ్‌ రవిశాస్త్రి ఈరోజే బుడగలోకి ప్రవేశించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని