కుంబ్లేను ఎదుర్కోడానికి ద్రవిడ్ సాయం: తైబు
టీమ్ఇండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ తనకూ బ్యాటింగ్ విషయంలో సాయం చేశాడని జింబాబ్వే మాజీ సారథి తతెందా తైబు పేర్కొన్నాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు స్పిన్...
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ తనకూ బ్యాటింగ్ విషయంలో సాయం చేశాడని జింబాబ్వే మాజీ సారథి తతెందా తైబు పేర్కొన్నాడు. భారత్‌తో టెస్టు మ్యాచ్‌లు ఆడేటప్పుడు స్పిన్ దిగ్గజం అనిల్‌కుంబ్లే బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై స్పష్టతనిచ్చాడని చెప్పాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు క్రాలే, సిబ్లీ.. లంక స్పిన్నర్ ఎంబుల్దేనియా బౌలింగ్‌ను ఆడటంలో విఫలమయ్యారు. ఈ విషయాన్ని గమనించి ఆ జట్టు మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ట్విటర్లో పలు పోస్టులు చేశాడు. తాను ఆడే రోజుల్లో ఇలాగే ఇబ్బంది పడితే ద్రవిడ్ సాయం చేశాడని చెప్పాడు. ఆ విషయాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు ఇంగ్లాండ్ బోర్డు కూడా ద్రవిడ్ చెప్పిన విషయాలను కాపీలు తీసి క్రాలే, సిబ్లీకి అందజేయాలని సూచించాడు.
ఈ క్రమంలోనే ఆ పోస్టును చూసిన తైబు పీటర్సన్‌కు రిప్లై ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో ద్రవిడ్ తనకూ సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. ‘టీమ్ఇండియాతో నేను ఆడిన తొలి రెండు టెస్టుల్లో మూడుసార్లు కుంబ్లే చేతిలో ఔటయ్యాను. ఆ సమయంలో ద్రవిడ్ నుంచి సలహాలు పొందాను. మ్యాచ్ అయ్యాక అతనితో మాట్లాడినప్పుడు కుంబ్లే బౌలింగ్‌ను.. స్లో మీడియం పేస్ బౌలర్‌ను ఎదుర్కొనేటట్లు ఆడాలని చెప్పాడు. బంతిని తదేకంగా చూస్తూ కాళ్ల కంటే ముందు బ్యాట్‌ను ఉంచాలని, కాస్త ఆలస్యంగా షాట్ ఆడాలని తెలిపాడు. అయితే, ఆ షాట్‌ను చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు. బంతి టైమింగ్‌ను బట్టి ముందుకు వచ్చి దాన్ని గమనిస్తూనే ఫ్రంట్‌ఫుట్ తీసుకొని షాట్ ఆడాలి’ అని తైబు పేర్కొన్నాడు. తైబు 2001లో 18 ఏళ్ల వయసులో జింబాబ్వే జట్టులో చేరాడు. అప్పటి నుంచీ 2012 వరకు మొత్తం 28 టెస్టులు, 150 వన్డేలు, 17 టీ20 ఆడాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో ఒక శతకంతో 1,546, వన్డేల్లో రెండు శతకాలతో 3,393 పరుగులు చేశాడు.
ఇవీ చదవండి..
ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె
ఒకే ఆటగాడు. ఒకే బంతి.. రెండుసార్లు రనౌట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
క్రికెట్ ఆట ఆడేది పదకొండు మందే.. కానీ ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ ఉపయోగించుకోవడమే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన (impact player rule). -
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్‌లో పూర్’
ఒకరు మాజీ క్రికెటర్.. మరొకరు ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్. వీరద్దరూ కలిసి ఓ షోలో చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. -
Rishab Pant: ఆట పట్టించిన అభిమాని.. రిషభ్ పంత్ ఏం చేశాడో తెలుసా?
ప్రముఖ యూట్యూబర్, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వీరాభిమాని. ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్ పంత్‌ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు.
-
KL Rahul: కేఎల్ రాహుల్ మంచి మనసు.. చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరికెళ్లి సెల్ఫీ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడేందుకు లఖ్‌నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్‌నవూ జట్టుకు అభిమాని. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్‌ఫోన్ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు.
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్‌నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్‌తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్‌ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్‌కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్‌ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్‌ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్‌ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్‌పై అంపైర్‌తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్‌తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్‌లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్‌కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్‌శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్‌కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్‌నవూ నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్‌లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్‌రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్‌పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి