T20 World Cup Final: కేన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కీలకమైన పోరులో...
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కీలకమైన పోరులో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (85: 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ నెగ్గిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లకు కేవలం 57 పరుగులు సాధించిన కివీస్.. ఆఖరి పది ఓవర్లలో 115 పరుగులు రాబట్టింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (4 ఓవర్లలో 60) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మిచెల్ (8 బంతుల్లో 11: ఒక సిక్స్) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ కేన్‌తో కలిసి మార్టిన్ గప్తిల్ (28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్ ఆసీస్ ఫీల్డర్ స్టాయినిస్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్స్ (18: ఒక ఫోర్, ఒక సిక్స్)తో కలిసి కేన్ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్.. తర్వాత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్లో 14వ అర్ధశతకం నమోదు చేశాడు. ఒక పక్క ధాటిగా ఆడుతుండటం.. మరోవైపు బంతులు ఉండటంతో టీ20ల్లో కేన్ విలియమ్సన్ తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ సాధ్యపడలేదు. 85 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లలో సీఫర్ట్ (8*), నీషమ్ (13*) బ్యాటింగ్‌తో కివీస్ స్కోరు 170 పరుగులు దాటింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్