Updated : 30/10/2021 17:25 IST

T20 World Cup 2021: శ్రీలంక ఆలౌట్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం 143

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచులో శ్రీలంక మోస్తరు పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ముందు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ పీతమ్‌ నిశాంక (72) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రెయిజ్‌ షంసి, డ్వెయిన్‌ ప్రిటోరియస్ మూడేసి, అన్రిచ్ నోర్జే రెండు వికెట్లు తీశారు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నెమ్మదిగా ఆటను ఆరంభించింది. నాలుగో ఓవర్లోనే ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా (7) ఔటయ్యాడు. అన్రిచ్‌ నోర్జే బౌలింగ్‌లో అతడు బౌల్డయ్యాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 39/1 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన చరిత్‌ అసలంక (21), మరో ఓపెనర్‌ పీతమ్‌ నిశాంకతో కలిసి ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే కేశవ్‌ మహరాజ్‌ వేసిన 9వ ఓవర్లో పరుగు తీసేందుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సే (0), అవిష్క ఫెర్నాండో (3), వానిందు హసరంగ (4) వరుసగా విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. ఓపెనర్‌ నిశాంక నిలకడగా ఆడుతూ 15వ ఓవర్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచాడు. 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో నిశాంక ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలోనే శ్రీలంక మొత్తం నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో వచ్చిన దసున్ శనక (11), చమిక కరుణరత్నే (5), దుష్మంత చమీర (3) వరుసగా పెవిలియన్‌ చేరారు. మహేశ్‌ తీక్షణ (7) నాటౌట్‌గా నిలిచాడు. నిశాంక రాణించినా అతడికి సహకరించే బ్యాటర్‌ లేకపోవడంతో శ్రీలంక పెద్దగా స్కోరు చేయలేకపోయింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం

జనరల్