IPL: వాయిదా వేయండని ముందే చెప్పా

ప్రజల ప్రాణాల కన్నా మరేదీ ముఖ్యం కాదని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. ఐపీఎల్‌ను వాయిదా వేయాలని రెండు వారాల...

Published : 06 May 2021 01:29 IST

పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ట్వీటు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజల ప్రాణాల కన్నా మరేదీ ముఖ్యం కాదని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అంటున్నాడు. ఐపీఎల్‌ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను సూచించానని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్‌ చేశాడు.

కరోనా వైరస్‌ వల్ల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 60 మ్యాచుల టోర్నీలో 29 మ్యాచులు ముగిసిన తర్వాత ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. కోల్‌కతా బౌలర్లు సందీప్‌ వారియర్‌, వరుణ్‌ చక్రవర్తి, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, దిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా, చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ పాజిటివ్‌గా తేలారు. బయో బుడగ బలహీనంగా మారింది.

లీగ్‌ను వాయిదా వేయడంపై అక్తర్‌ స్పందించాడు. ‘ఐపీఎల్‌ రద్దైంది. ఇలా అవుతుందని తెలుసు. రెండు వారాల క్రితమే వాయిదా వేయాలని సూచించాను. భారత్‌లో ప్రస్తుత కొవిడ్‌ సంక్షోభంలో మనుషుల ప్రాణాలు కాపాడటం కన్నా మరేదీ ముఖ్యం కాదు’ అని ట్వీటాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని