Kohli : కోహ్లీ వల్లే.. టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగింది: షేన్ వార్న్

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందని పేర్కొన్నాడు. తన నాయకత్వ పటిమతో ఎంతో..

Updated : 25 Jan 2022 11:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ ప్రశంసలు కురిపించాడు. అతడి వల్లే టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందని పేర్కొన్నాడు. తన నాయకత్వ పటిమతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపాడని అన్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో భారత్‌ 1-2 తేడాతో పరాజయం పాలైన అనంతరం.. టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ ముగింపు పలికిన విషయం తెలిసిందే.

‘విరాట్‌ కోహ్లీ గొప్ప నాయకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడి నాయకత్వంలోనే భారత్‌ టెస్టు క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. వ్యూహాల విషయంలో అతడు మెరుగు పడాల్సి ఉన్నా.. నాయకుడిగా కొనసాగినంత కాలం జట్టు సభ్యుల్లో స్ఫూర్తి నింపాడు. తన ఆటతీరుతో టెస్టు క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లిన తీరు చూశాక అతడిపై గౌరవం మరింత పెరిగింది. అతడో అద్భుతమైన క్రికెటర్‌. టెస్టు క్రికెట్‌కు గొప్ప రాయబారి. సుదీర్ఘ ఫార్మాట్ పట్ల అతడికి మక్కువ ఎక్కువ. ప్రస్తుత టీ20 క్రికెట్‌ యుగంలో కూడా టెస్టు క్రికెట్‌కు ఆదరణ పెరిగిందంటే అది కోహ్లీ వంటి గొప్ప ఆటగాళ్ల వల్లనే సాధ్యమైంది. ఇలాంటి ఆటగాళ్లు లేకుంటే ఇప్పటికే చాలా దేశాలు సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరమయ్యేవి. టెస్టుల ద్వారానే ఆటగాళ్ల సత్తా వెలుగులోకి వస్తుంది. టెస్టు క్రికెట్‌ను ప్రోత్సహించడంలో బీసీసీఐ కూడా ఎప్పుడూ ముందుంటుంది. ఆ విషయంలో మనమంతా కోహ్లీకి, అతడికి సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలి’ అని షేన్ వార్న్‌ పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ అనంతరం.. భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో రోహిత్‌ శర్మకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని షేన్‌వార్న్‌ సూచించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని