IND vs SA : దక్షిణాఫ్రికా స్పిన్నర్లే నిలకడగా బౌలింగ్ చేశారు: పంత్
టీమ్ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా బంతులు విసిరారని రిషభ్ పంత్ అన్నాడు. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో అర్ధశతకం (85) చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 287/6 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ.. సఫారీల బౌలర్లు షంసి, కేశవ్ మహరాజ్, మార్క్రమ్ చాలా చక్కగా బౌలింగ్ చేశారని అభినందించాడు.
‘‘పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. అయితే భారత్ చేసిన పరుగులు సరిపోతాయని భావించా. కానీ దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడి విజయం సాధించారు. తొలి మ్యాచ్‌లో మేం ఛేదనకు దిగాం. మొదట వారు బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ అనుకూలించింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ స్లో అయిపోయింది. దీంతో పరుగులు చేయడం కష్టంగా మారింది. ఇక నిన్నటి వన్డేలో మధ్య ఓవర్లలో వారు చాలా బాగా ఆడారు. మేం వికెట్లను పడగొట్టడంలో విఫలమయ్యాం’’ అని పంత్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాఫ్రికా ఆటగాళ్లు బాగా ఆడారు. భాగస్వామ్యాలు, మిడిలార్డర్ వైఫల్యం, మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వంటి కొన్ని తప్పులు చేశాం. అయితే నేర్చుకునేందుకు ఇదొక అవకాశం’’ అని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్‌కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్‌నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్‌కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్‌నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్‌కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్‌నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్‌నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్‌గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్‌పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్‌లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్‌లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్‌కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్‌కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్