Sarah Taylor: పురుషుల జట్టుకు మహిళా కోచ్‌

క్రికెట్‌ చరిత్రలోనే మొదటి సారిగా పురుషుల క్రికెట్‌ జట్టుకు ఓ మహిళా కోచ్‌గా సేవలు అందించనుంది. ఇంగ్లాండ్‌ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్‌ సారా టేలర్‌ పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికై అరుదైన రికార్డును సృష్టించింది. ఈ క్రీడాకారిణి టీమ్‌ అబుదాబి జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమితులైంది.

Updated : 30 Oct 2021 04:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ చరిత్రలోనే మొదటి సారిగా పురుషుల క్రికెట్‌ జట్టుకు ఓ మహిళా కోచ్‌గా సేవలు అందించనుంది. ఇంగ్లాండ్‌ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్‌ సారా టేలర్‌ పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఎంపికై అరుదైన రికార్డును సృష్టించింది. ఈ క్రీడాకారిణి టీమ్‌ అబుదాబి జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమితులైంది. నవంబర్‌ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్‌ ప్రారంభం కానుంది. అయితే సారా టేలర్‌ ఇప్పటికే సస్సెక్స్ కౌంటీకి స్పెషలిస్ట్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో పురుషుల ఫ్రాంచైజీ క్రికెట్‌ జట్టుకు సహాయక కోచ్‌గా ఎంపిక కావడం విశేషం. ఇంగ్లాండ్‌ సాధించిన రెండు వరల్డ్‌ కప్‌లు, ఒక టీ20 వరల్డ్‌ కప్‌ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. 32 ఏళ్ల సారా టేలర్‌ ఇంగ్లాండ్‌ మహిళా జట్టు తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడింది. సుదీర్ఘ ఫార్మాట్లో 300, వన్డేల్లో 4,056, టీ20ల్లో 2,177 పరుగులు సాధించారు. మానసిక, ఆరోగ్య సమస్యల కారణంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుతున్నట్టు ప్రకటించింది. అయితే టీ20 లీగ్‌ల్లో మాత్రం పాల్గొంటూ బిజీగా ఉంటోంది సారా టేలర్. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ‘వెల్ష్ ఫైర్’ జట్టుకి ఆడుతున్న సారా టేలర్, వుమెన్స్ టీ20కప్‌లో సుసెక్స్, నార్తన్ డైమండ్స్ జట్లకి ఆడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని