Dhoni: ఈ భారత జట్టును అతడే తీర్చిదిద్దాడు

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంటే జట్టులోని ప్రతి ఒక్కరికీ ఎంతో అభిమానం, గౌరవం. ఏ ఆటగాడిని కదిలించినా ఇదే విషయం చెబుతారు...

Published : 06 Jul 2021 01:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంటే జట్టులోని ప్రతి ఒక్కరికీ ఎంతో అభిమానం, గౌరవం. ఏ ఆటగాడిని కదిలించినా ఇదే విషయం చెబుతారు. ఎందుకంటే మహీ ఈ జట్టుపై అంతలా ప్రభావం చూపాడు. తన ఆటతోనే కాకుండా కెప్టెన్సీ, వ్యక్తిత్వంతోనూ అతడు ఉన్నత శిఖరాలకు చేరాడు. దాంతో అతడు టీమ్‌ఇండియాకు దూరమై రెండేళ్లు గడుస్తున్నా మిగతా ఆటగాళ్లు ఇప్పటికీ మిస్‌ అవుతున్నారనే భావన నెలకొంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్‌ సాబా కరిమ్‌ను అడగ్గా ఇలా స్పందించాడు.

‘టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇప్పటికీ ధోనీని మిస్‌ అవ్వడానికి ప్రధాన కారణం.. ప్రస్తుత జట్టులోని ప్రతి ఒక్కరూ అతడి సారథ్యంలోనే అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభించారు. ఈ ఆటగాళ్లందరినీ అతను తీర్చిదిద్దిన విధానం ఎంతో గొప్పది. వాళ్లని ముందుండి నడిపించాడు. మ్యాచ్‌ విన్నర్లుగా తయారుచేశాడు. అందుకే ప్రతి ఒక్కరూ అతడి గురించి గొప్పగా చెబుతారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ధోనీ ఏం చేశాడో ఆటగాళ్లే కాకుండా అభిమానులందరికీ తెలుసు. తన ఆటలో ఎక్కడా ఒత్తిడికి గురైనట్లు కనిపించడు. ఈ క్రమంలోనే అతడి నుంచి టీమ్ఇండియా ఆటగాళ్లు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు’ అని మాజీ క్రికెటర్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని