Tokyo Olympics: హరియాణా హాకీ క్రీడాకారులకు ₹ 2.5 కోట్ల నజరానా

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన పురుషుల హాకీ జట్టులోని హరియాణా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

Updated : 09 Dec 2021 16:45 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన పురుషుల హాకీ జట్టులోని హరియాణా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లకు రూ.2.5 కోట్ల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. దాంతోపాటు క్రీడా శాఖలో ఉద్యోగం, రాయితీపై ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ట్విటర్‌ వేదికగా గురువారం వెల్లడించారు. పురుషుల హాకీ జట్టు ఫొటోను కూడా ఆయన ఆ ట్వీట్ ద్వారా షేర్‌ చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా హాకీ జట్టులో తమ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లు వివేక్‌ సాగర్‌, నీలకంఠలకు రూ. కోటి చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. పంజాబ్‌ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని