boxing: ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది.  75 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి పూజా రాణి పసిడి పతాకాన్ని అందుకుంది. ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్‌ బాక్సర్‌

Updated : 31 May 2021 22:19 IST

(photo: kiren rijiju twitter)

దుబాయ్‌: ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది.  75 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి పూజా రాణి పసిడి పతాకాన్ని అందుకుంది. ఫైనల్‌లో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ మాలోనోవాపై 5-0తేడాతో పూజారాణి విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 2019 ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సైతం పూజారాణి 81 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 2020లో ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ నిర్వహించలేదు. పూజారాణి టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించింది. 

ఫైనల్‌లో  విఫలమైన మేరీకోమ్‌..

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌, భారత స్టార్‌ మేరీకోమ్‌ ఫైనల్‌లో విఫలమైంది. 51 కేజీల విభాగంలో పాల్గొన్న మేరీకోమ్‌ కజకిస్థాన్‌ బాక్సర్‌ నజిమ్‌ కజయ్‌బె చేతిలో (2-3 తేడా) ఓటమి పాలైంది. దీంతో రజత పతకాన్ని గెలుచుకుంది. ఇప్పటివరకు ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మేరీకోమ్‌ 7 పతకాలు సాధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని