paralympics: పతక విజేతలపై ప్రశంసల వర్షం

టోక్యో పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం సాధించిన పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌,  కాంస్యం అందుకున్న మనోజ్‌ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, బీజింగ్‌(2008 ) ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అభినవ్‌ బింద్రా, భారత మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌,

Updated : 05 Sep 2021 04:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం సాధించిన పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌, కాంస్యం అందుకున్న మనోజ్‌ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, బీజింగ్‌ ఒలింపిక్స్‌ బంగారు పతక విజేత అభినవ్‌ బింద్రా, భారత మాజీ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు వీరికి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.

శనివారం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-3 విభాగం ఫైనల్‌లో ప్రమోద్‌ భగత్‌ స్వర్ణం సాధించాడు. గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన డేనియల్‌ బెథెల్‌పై ప్రమోద్‌ భగత్‌ 21-14,21-17 తేడాతో విజయం సాధించి.. పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఇక, ఎస్‌ఎల్‌-3 విభాగంలోనే కాంస్యం కోసం జరిగిన పోరులో మనోజ్‌ సర్కార్‌ జపాన్‌కు చెందిన పుజిహారాను 22-20, 21-13 తేడాతో ఓడించి ‘కంచు’మోగించాడు.

‘ప్రమోద్ భగత్‌ యావత్‌ దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అతడు ఛాంపియన్‌. ఈ విజయం ఎన్నో లక్షల మందిని చైతన్యపరుస్తుంది. ప్రమోద్‌ అద్భుతమైన పట్టుదలను చూపించాడు. బ్యాడ్మింటన్‌లో స్వర్ణం గెలిచినందుకు అతడికి అభినందనలు. భవిష్యత్‌లో కూడా రాణించాలని కోరుకుంటున్నా’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

‘బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నంబర్ 1 ప్రమోద్ భగత్‌ పారాలింపిక్స్‌ లేదా ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత మొదటి షట్లర్‌. అద్భుతమైన ప్రదర్శన. ఛాంపియన్‌కి అభినందనలు’ అని అభినవ్‌ బింద్రా ట్వీట్‌ చేశాడు.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు