సింధు విజయం.. శ్రీకాంత్ ఓటమి

బీడబ్ల్యూఎఫ్ టూర్‌ ఫైనల్స్‌ను ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు విజయంతో ముగించిగా, మరో భారత స్టార్ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ పరాజయంతో ముగింపు పలికాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన వీరిద్దరు...

Updated : 29 Jan 2021 16:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బీడబ్ల్యూఎఫ్ టూర్‌ ఫైనల్స్‌ను ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు విజయంతో ముగించిగా, మరో భారత స్టార్ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ పరాజయంతో ముగింపు పలికాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన వీరిద్దరు సెమీస్‌ రేసు నుంచి గురువారమే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో సింధు ఘన విజయం సాధించింది. మహిళల సింగ్స్‌లో పోర్న్‌పావీ (థాయ్‌లాండ్‌)తో జరిగిన మ్యాచ్‌లో 21-18, 21-15తో గెలిచింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

మరోవైపు నామమాత్రపు మ్యాచ్‌లోనైనా గెలిచి విజయంతో టోర్నీని ముగించాలనుకున్న శ్రీకాంత్‌కు నిరాశే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో లాంగ్‌ ఆగ్నస్‌ (హాంకాంగ్‌) చేతిలో 21-12, 18-21, 19-21తో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన శ్రీకాంత్.. తర్వాత గేమ్‌ల్లో ఆ జోరును ప్రదర్శించలేకపోయాడు.

ఇదీ చదవండి

పఠాన్‌.. పాక్‌పై నీ హ్యాట్రిక్‌ ఇంకా గుర్తుంది

రబాడ సాధించేది తల్చుకుంటే భయమేస్తుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని