Neeraj chopra: అమ్మా నాన్న కల నిజం చేసుకున్న నీరజ్‌ చోప్రా

నీరజ్‌ చోప్రా.. పరిచయం అవసరంలేని అథ్లెట్‌, జావెలిన్‌ త్రో క్రీడాకారుడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో 87.58 మీటర్ల ప్రదర్శన ఇచ్చి స్వర్ణం సాధించారీ 23ఏళ్ల క్రీడాకారుడు. తాజాగా ఆయన తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నట్లు ట్వీట్‌ చేశారు. ‘‘ తొలిసారి మా అమ్మానాన్న ఫ్లైట్‌ ఎక్కారు. ఈరోజుతో నా కల నెరవేరింది’’ అంటూ కుటుంబసభ్యులందితో దిగిన మూడు ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

Updated : 11 Sep 2021 15:40 IST

చిరకాల స్వప్నం నిజమైందన్న నీరజ్ చోప్రా

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా శనివారం తన చిరకాల కల నెరవేర్చుకున్నాడు. తన తల్లిదండ్రులను విమానం ఎక్కించి సంబరపడ్డాడు. ఆ విషయాన్ని ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకొని సంతోషం వెలిబుచ్చాడు. ‘‘తొలిసారి మా అమ్మానాన్న ఫ్లైట్‌ ఎక్కారు. ఈరోజుతో నా కల నెరవేరింది’’ అంటూ అమ్మానాన్నలతో దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నాడు. భాగోద్వేగభరితమైన ఈ క్షణాలకు ఫిదా అయిన అభిమానులు.. ఈ ఫొటోలను సేవ్‌ చేసుకోండని పేర్కొంటూ కామెంట్ల ద్వారా బదులిచ్చారు. అలాగే నీరజ్‌ ఎప్పుడైనా నిరుత్సాహపడినప్పుడు.. ఈ ఆనందక్షణాలను తలుచుకుంటే కొత్త ఉత్సాహం వస్తుందన్నారు.

నీరజ్‌కి ఇవి నిజంగా సంతోషకరమైన క్షణాలే.. ఎందుకంటే సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన అతడు టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏకైక స్వర్ణం అందించాడు. ఫైనల్స్‌లో 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ త్రో విసిరి చరిత్ర సృష్టించాడు. అలాంటి గొప్ప అథ్లెట్‌కు ఇది చిన్న కలే అయినా దాన్ని నిజం చేసుకోవడానికి ఇంత సమయం పట్టింది. నీరజ్‌ ఇంట్లో ఎవరికీ క్రీడా నేపథ్యం లేదు. తండ్రి సతీష్‌ కుమార్‌. అమ్మ సరోజ్‌ బాల. పానిపట్‌ దగ్గర్లోని ఖాంద్రా సొంతూరు. అతడు క్రీడాకారుడిగా మారడం వెనుక కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. చిన్నప్పుడు నీరజ్‌ అధిక బరువు ఉండడంతో బాబాయ్‌ భీమ్‌సేన్‌ జిమ్‌లో చేర్పించారు. ఆపై స్నేహితులతో కలిసి గ్రౌండ్‌కెళ్లి జావెలిన్‌ త్రో నేర్చుకున్నాడు. చివరికి అథ్లెట్‌గా ఎదిగి భారతావని గర్వించే స్థాయికి ఎదిగాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని