Virat Kohli: కోహ్లీ వైఫల్యాల వెనుక అదే కారణం..: మిస్బా

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గత రెండున్నరేళ్లుగా ఒక్క శతకం కూడా సాధించకపోవడం అటు అభిమానులనే కాకుండా ఇటు మాజీ క్రికెటర్లకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది...

Published : 02 Jul 2022 02:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గత రెండున్నరేళ్లుగా ఒక్క శతకం కూడా సాధించకపోవడం అటు అభిమానులనే కాకుండా ఇటు మాజీ క్రికెటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కోహ్లీ చివరిసారి 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన డే/నైట్‌ టెస్టులో శతకం బాదాడు. ఆ తర్వాత మరో మూడంకెల స్కోర్‌ అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడి వైఫల్యానికి గల కారణాలపై ఇప్పటికే పలువురు మాజీలు స్పందించగా.. తాజాగా పాకిస్థాన్‌ మాజీ కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ సైతం తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘మదిలో ఏవేవో ఆలోచనలు ఉన్నప్పుడు మనసు, శరీరం మధ్య సమన్వయం లోపిస్తుంది. దాంతో ఆటగాళ్లు సరిగ్గా ఆడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత గొప్ప ఆటగాడైనా విఫలమవుతాడు. ఆటలో ఇవన్నీ సహజమే. కోహ్లీ సైతం సహజంగా ఆఫ్‌సైడ్‌ వెళ్లే బంతుల్ని వేటాడి ఔటవుతుంటాడని మనం చెప్పుకొంటుంటాం. అయితే, అతడు మాటిమాటికీ అదే షాట్‌ ఎందుకు ఆడుతున్నాడు? అంటే దాని వెనక మానసిక సమస్య ఉందని అర్థం. కోహ్లీకి అహం ఎక్కువ. ఎక్కడైనా ఆధిపత్యం చలాయించాలని అనుకుంటాడు. దాంతో సరిగ్గా ఆడలేక పక్కదారి పట్టే అవకాశం ఉంది. అతడిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు తన వైఫల్యాల నుంచి బయటపడాలంటే ఆ ఒత్తిడిని అధిగమించాలి. నాక్కూడా ఒకసారి ఇలాగే జరిగింది. దాంతో నేను క్లబ్‌ క్రికెట్‌కు వెళ్లి గాడినపడ్డా’ అని మిస్బా ఓ యూట్యూబ్‌ ఛానల్లో వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని