Bumra-Wood: బుమ్రా స్పెషల్‌ స్కిల్‌ను.. ఇలా దోచేస్తా: మార్క్‌ వుడ్

మైదానంలో బరిలోకి దిగారంటే.. ఒకరిపై మరొకరు తమ అస్త్రాలను సంధించుకుంటారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకుంటారు. అయితే స్టేడియం వెలుపల ...

Published : 09 Nov 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైదానంలో బరిలోకి దిగారంటే.. ఒకరిపై మరొకరు తమ అస్త్రాలను సంధించుకుంటారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకుంటారు. అయితే స్టేడియం వెలుపల తామంతా మంచి స్నేహితులమేనని క్రికెటర్లు చాటిచెబుతుంటారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా స్పెషల్‌ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌తో సంభాషించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీనిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) షేర్‌ చేసింది. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు వార్మప్‌ మ్యాచ్‌లో తలపడ్డాయి కానీ.. గ్రూప్‌ స్టేజ్‌లో ఎదురపడలేదు. టీ20 ప్రపంచకప్‌లో జట్లన్నీ హోరాహోరీగా పోరాడాయి. చివరికి ఇంగ్లాండ్‌, ఆసీస్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. 

ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ ఒకడు. అయితే తన అమ్ములపొదిలోకి ఇంకో అస్త్రం కావాలట.. అదేంటంటే మన బుమ్రా వేసే స్పీడ్‌ యార్కర్‌ నైపుణ్యం. అయితే దాని కోసం హాలీవుడ్ మూవీ ‘స్పేస్‌ జంప్‌’ సూపర్‌పవర్‌తో బుమ్రా స్కిల్స్‌ను తస్కరిస్తానని మార్క్‌ వుడ్‌ చేసిన విన్యాసం భలేగా ఆకట్టుకుంది. దానికి బుమ్రా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌. దానినే ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మీరు మీ ప్రత్యర్థికి సంబంధించి ఏదైనా నైపుణ్యం దోచుకోవాలంటే ఎవరి నుంచి చేస్తావని మార్క్‌ను ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడుగుతాడు. దీనికి మార్క్‌వుడ్‌ సూపర్‌ సమాధానం ఇచ్చాడు. టీమ్‌ఇండియా స్పీడ్‌స్టర్‌ బుమ్రా పేరు చెప్పాడు. కేవలం ఐదు స్టెప్స్‌లో సరైన యార్కర్‌ను ఎలా సంధించాలనే స్కిల్‌ను తస్కరిస్తానని పేర్కొన్నాడు. అయితే మీరు ఎలా దోచుకుంటారు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. మార్క్‌వుడ్ ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. అదేంటో ఈ వీడియోలో మీరూ చూసేయండి...

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు