భారత్ ఆత్మీయ దేశం: పీటర్సన్‌

దక్షిణాఫ్రికాకు భారత్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్ల పంపించడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ సంతోషం వ్యక్తం చేశాడు. భారత ఆత్మీయ దేశమని కొనియాడాడు. భారతీయుల ఉదారత, సహృదయత...

Published : 03 Feb 2021 12:10 IST

ఇంటర్నెట్‌డెస్క్: దక్షిణాఫ్రికాకు భారత్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్ల పంపించడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ హర్షం వ్యక్తం చేశాడు. భారత ఆత్మీయ దేశమని కొనియాడాడు. భారతీయుల ఉదారత, సహృదయత రోజురోజుకి ఇనుమడిస్తోందని ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు భారత టీకాలు చేరాయని సోమవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్.జయశంకర్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీటర్సన్‌ ట్వీట్ చేశాడు.

ఇంగ్లాండ్ తరఫున 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20లు ఆడిన పీటర్సన్‌ దక్షిణాఫ్రికాలో జన్మించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతేగాక కొత్త రకం వైరస్‌ కూడా వ్యాప్తి చెందుతోంది. కరోనా భయంతో దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియాజట్టు వాయిదా వేసుకుంది. షెడ్యూలు ప్రకారం వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్‌ మూడు టెస్టులు ఆడాల్సివుంది.

ఇవీ చదవండి

చెపాక్‌ గడ్డ.. త్రిశతకాల అడ్డా!

ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయ్‌: లక్ష్మణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని