KP: కృపయా లోగ్‌ సురక్షిత్‌ రహె!

భారతీయులకు కలిగిన కష్టం త్వరలోనే సమసిపోతుందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు....

Published : 13 May 2021 01:37 IST

కెవిన్‌ పీటర్సన్ భావోద్వేగ ట్వీట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయులకు కలిగిన కష్టం త్వరలోనే సమసిపోతుందని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. కొవిడ్‌ రెండో వేవ్‌ త్వరలోనే ముగుస్తుందని పేర్కొన్నాడు. దయచేసి అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఈ మేరకు అతడు హిందీలో ట్వీట్‌ చేశాడు.

నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ కోసం పీటర్సన్‌ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ జరిగే మ్యాచులకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా విశ్లేషణ చేశాడు. లీగు వాయిదా పడటంతో అతడు ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. భారత్‌ను తానెంతగానే ప్రేమిస్తున్నానని చెప్పాడు. మిగిలిన ఐపీఎల్‌ సీజన్‌ను ఇంగ్లాండ్‌లోనే నిర్వహించాలని కోరాడు.

‘నేను భారత్‌ నుంచి వచ్చేసుండొచ్చు. కానీ నేనిప్పటికీ దాని గురించే ఆలోచిస్తున్నా. ఆ దేశం నాకెంతో ప్రేమ, అనురాగాలను పంచింది. అక్కడి ప్రజలు క్షేమంగా ఉండాలి. ఈ పరిస్థితి (రెండో వేవ్‌) గడిచిపోతుంది. ప్రజలు మాత్రం ఎప్పటికీ అప్రమత్తంగానే ఉండాలి’ అని పీటర్సన్‌ హిందీలో ట్వీట్‌ చేశాడు. అతడే కాకుండా భారత్‌ నుంచి వెళ్లిపోయిన కామెంటేటర్లు, క్రికెటర్లు ఇలాగే చెప్పిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని