‘అద్భుతం చేశావ్‌.. నాన్నా.!’

పారాలంపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఆటగాడు దేవేంద్ర ఝాఝరియా సత్తా చాటాడు. జావెలిన్‌ త్రో ఎఫ్‌-46 విభాగంలో 64.35 మీటర్ల దూరం విసిరి రజతం పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు పారాలంపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

Published : 30 Aug 2021 23:43 IST

సంతోషం వ్యక్తం చేసిన దేవేంద్ర ఝాఝరియా కూతురు 

టోక్యో: పారాలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఆటగాడు దేవేంద్ర ఝాఝరియా సత్తా చాటాడు. జావెలిన్‌ త్రో ఎఫ్‌-46 విభాగంలో 64.35 మీటర్ల దూరం విసిరి రజతం పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ‘ప్రస్తుతం నా వయసు 40 ఏళ్లు. ఈ వయసులో పారాలింపిక్స్‌లో పాల్గొనడం అవసరమా.? అని చాలా మంది అన్నారు. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని నేను వారికి బదులిచ్చాను. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం. దేశం కోసం పతకం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఫైనల్‌ పోరు ముగిసిన అనంతరం నా కూతురితో మాట్లాడాను. నేను రజత పతకం సాధించినందుకు తను చాలా సంతోషించింది. నాన్నా.. నువ్వు అద్భుతం చేశావంది. తనను చూసి చాలా రోజులైంది. నా కుటుంబంతో కొంత సమయం గడిపిన తర్వాత.. భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఆలోచిస్తా. 2024 పారిస్‌ పారాలింపిక్స్‌లో కూడా పాల్గొంటాను’ అని  చెప్పారు. జావెలిన్‌ త్రో ఫైనల్‌ పోరులో శ్రీలంక ఆటగాడు దినేశ్ ప్రియన్‌ హెరాత్‌ 67.79 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని