Euro cup final: యూరో కప్ ఛాంపియన్‌గా ఇటలీ
యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఇటలీ అదరగొట్టింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్ను మరోసారి ముద్దాడింది. గత
ఇంగ్లాండ్‌ను ఓడించి రెండో సారి కప్పును ముద్దాడిన ఇటలీ
(PHOTO: UEFA Twitter నుంచి)
లండన్: యూరోపియన్ ఛాంపియన్షిప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఇటలీ అదరగొట్టింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్ను మరోసారి ముద్దాడింది. గత కొన్నేళ్లుగా మెగా టోర్నీలో విఫలమవుతున్న ఇటలీకి ఈ విజయంతో సాంత్వన లభించినట్టైంది. లండన్ వేదికగా అభిమానులు కిక్కిరిసిన వెంబ్లే స్టేడియంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో ఆట అదనపు సమయానికి దాసి తీసింది. అదనపు సమయంలో కూడా ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ ఇక పెనాల్టీ షూటౌట్‌కు మారింది. ఇటలీ ఆరు అవకాశాల్లో మూడింటిని గోల్స్ చేయగా, ఇంగ్లాండ్ రెండింటిని మాత్రమే గోల్‌గా మలిచింది. దీంతో 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చి కప్పు కొడుదామన్న ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి.
ఇక ఆటలో తొలి గోల్ ఇంగ్లాండే చేసినప్పటికీ ఆధిపత్యమంతా ఇటలీదే. ఆట ప్రారంభమైన 2వ నిమిషానికే ఇంగ్లాండ్ ఆటగాడు లూక్ షా గోల్చేశాడు. యూరో కప్ ఫైనల్ చరిత్రలో మ్యాచ్ ప్రారంభమైన 2 నిమిషాలకే గోల్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక ఆ ఆధిక్యాన్ని తొలి అర్ధభాగం ముగిసే సమయం వరకు అలాగే కాపాడుకుంది. ఇక 67వ నిమిషంలో ఇటలీ ఆటగాడు లియానార్డో బోనుచి గోల్ చేసి స్కోరును సమం చేశాడు. దీంతో ఆధిపత్యం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత, అదనపు సమయంలో కూడా ఇరు జట్లు 1-1తో నిలిచాయి. ఇక పెనాల్టీ షూటౌట్లో గోల్‌కీపర్ డోనరుమా ఆఖరి బంతిని అద్భుతంగా అడ్డుకొని ఇటలీని విజయతీరాలకు చేర్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని