Virat Kohli: కోహ్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: సెహ్వాగ్‌

జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చిన విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. చాలాకాలంగా అతడు గొప్పగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20..

Updated : 09 Nov 2021 12:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జట్టులోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చిన విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నాడు. చాలాకాలంగా అతడు గొప్పగా రాణిస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో కోహ్లి బ్యాటింగ్‌ స్థానంపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని సెహ్వాగ్‌ అన్నాడు.

‘టీమిండియాలోకి ఎంతమంది యువ ఆటగాళ్లు వచ్చినా.. విరాట్‌ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయలేరు. బ్యాటుతో చాలాకాలంగా అతడు గొప్పగా రాణిస్తున్నాడు. అతడికి ఇష్టమొచ్చినంత కాలం టీ20ల్లో ఆడుతూనే ఉంటాడు. అతడు బ్యాటింగ్‌కు దిగే స్థానంపై సందేహాలు అక్కర్లేదు’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. మాజీ పేసర్ ఆశిశ్‌ నెహ్రా కూడా సెహ్వాగ్ అభిప్రాయాన్ని సమర్థించాడు. ‘బ్యాటింగ్‌లో కోహ్లి అంత స్థిరత్వంతో ఎవరూ రాణించలేరు. జట్టునిండా పవర్‌ హిట్టర్లుంటే సరిపోదు. కీలక సమయాల్లో జట్టును గట్టెక్కించగల సీనియర్లు కూడా ఉండాలి’ అని నెహ్రా అన్నాడు. 2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో కోహ్లి టాప్ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టీ20ల్లో  కోహ్లి 87 ఇన్నింగ్స్‌లు ఆడి.. 52.05 సగటుతో 3,227 పరుగులు చేశాడు. ఇందులో 29 అర్ధ శతకాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని