IPL 2021: నాలో ఆత్మవిశ్వాసానికి ఆ వీడియోలే  కారణం: ఇషాన్‌ కిషన్‌

ముంబయి ఇండియన్స్‌ తుది జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌తో జరిపిన సంభాషణలు తనలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపాయని ఇషాన్‌ కిషన్‌ అన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జట్టు యాజమాన్యం తనపై నమ్మకం ఉంచిందని వివరించాడు.

Published : 07 Oct 2021 01:11 IST

(Photo: Mumbai Indians Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ తుది జట్టులో స్థానం కోల్పోయిన సమయంలో విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌తో జరిపిన సంభాషణలు తనలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని నింపాయని ఇషాన్‌ కిషన్‌ అన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జట్టు యాజమాన్యం తనపై నమ్మకం ఉంచిందని వివరించాడు. మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ ( 50 నాటౌట్‌; 25 బంతుల్లో 5×4, 3×6) అదరగొట్టి ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కిషన్‌ మాట్లాడాడు.

‘తిరిగి ఓపెనింగ్‌ చేయడం, జట్టు కోసం పరుగులు చేయడం, భారీ  తేడాతో విజయం సాధించడానికి సహాయపడటం ఆనందంగా ఉంది. నిజంగా ఇది మంచి అనుభూతి. మా జట్టు పుంజుకోవడానికి ఇది అవసరం. ఒడిదొడుకులు అనేవి ఏ క్రీడాకారుని జీవితంలోనైనా ఓ భాగం అని భావిస్తా. ప్రస్తుతం నేను కూడా గొప్ప స్థితిలో లేను. గత సీజన్లలో మాదిరిగా చాలా మంది బ్యాటర్లు పరుగులు చేయలేకపోతున్నారు. మాకు మంచి సహాయక సిబ్బంది, కెప్టెన్‌ ఉన్నారు’ అని ఇషాన్ కిషన్‌ అన్నాడు.

‘విరాట్ భాయ్‌ ( విరాట్‌ కోహ్లి), హార్దిక్ పాండ్యతో సంభాషణలు జరిపా. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారు. కీరన్‌ పొలార్డ్‌తో మాట్లాడినప్పుడు.. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. గత సీజన్లలో నేను బ్యాటింగ్‌ చేసిన వీడియోలను చూడమని చెప్పాడు. కొన్ని వీడియోలను చూశా. అవి నాలో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి’ అని ఇషాన్‌ కిషన్‌ ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని