IND vs ENG: భారత్‌ × ఇంగ్లాండ్‌.. మూడో టెస్టుతో నమోదైన కొత్త రికార్డులివే..!

టీమ్‌ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసింది.........

Published : 29 Aug 2021 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రూట్ సేన..సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌ ద్వారా నమోదైన కొత్త రికార్డులను పరిశీలిస్తే.. 

 అత్యధిక విజయాలు అందించిన ఇంగ్లాండ్ కెప్టెన్లు.. 

 * జో రూట్: ఇంగ్లాండ్‌ జట్టుకు 55 టెస్టుల్లో నాయకత్వం వహించి 27 మ్యాచులు గెలిపించాడు. 

* మైఖేల్ వాన్‌: 51 టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి 26 మ్యాచుల్లో విజయాలు అందించాడు.

*ఆండ్రూ స్ట్రాస్‌: 50 మ్యాచుల్లో సారథిగా ఆడి 24 మ్యాచుల్లో విజయతీరాలకు నడిపించాడు.

*ఆలిస్టర్ కుక్‌: 59 టెస్టులకు కెప్టెన్‌గా సేవలందించి 24 మ్యాచుల్లో గెలిపించాడు. 

*పీటర్‌ మే: 41 టెస్టుల్లో సారథ్యం వహించి 20 మ్యాచుల్లో విజయాలు సాధించాడు.

కోహ్లీ కెప్టెన్సీలో ఇన్నింగ్స్‌ తేడాతో ఓటములు..

*2018లో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్ మధ్య జరిగిన టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

*2021లో (ప్రస్తుత సిరీస్‌) లీడ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో భారత్.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

కోహ్లీ నాయకత్వంలో టీమ్‌ఇండియా టాస్‌ గెలిచి ఓడిన టెస్టులు

*ఆడిలైడ్ టెస్టు 2020/21: ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ వేదికగా గతేడాది చివర్లో జరిగిన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవం చవిచూసింది.

*లీడ్స్‌ టెస్టు 2021: ప్రస్తుత ఇంగ్లాండ్‌ పర్యటనలో లీడ్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులోనూ టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత భారత్ అతి తక్కువ పరుగులు చేసిన టెస్టులు

*41 పరుగులు: పుణె వేదికగా 2016/17లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌ల్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత అతి తక్కువగా 41 పరుగులు చేసింది. 

*63 పరుగులు: 2021లో (ప్రస్తుత సిరీస్‌) లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత 63 పరుగులే చేసింది.

*64 పరుగులు: 1952లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా నాలుగో వికెట్ కోల్పోయిన తర్వాత 64 పరుగులు చేసింది.

*77 పరుగులు: 2020/21లో ఆడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో నాలుగో వికెట్ కోల్పోయాక టీమ్‌ఇండియా 77 పరుగులు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని