IND vs NZ: తొలి సెషన్‌ న్యూజిలాండ్‌దే.. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన భారత్‌

ఐదోరోజు ఆట తొలి సెషన్‌లో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చెలాయించింది. 4/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లాథమ్‌ (35), సోమర్‌విలే(36) నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై పైచేయి సాధించారు...

Updated : 29 Nov 2021 11:46 IST

కాన్పూర్‌: ఐదోరోజు ఆట తొలి సెషన్‌లో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చెలాయించింది. 4/1తో సోమవారం ఉదయం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లాథమ్‌ (35), సోమర్‌విలే(36) నిలకడగా ఆడుతూ భారత బౌలర్లపై పైచేయి సాధించారు. ఈ సెషన్‌ మొత్తంలో టీమ్‌ఇండియా 31 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయింది. భోజన విరామ సమయానికి న్యూజిలాండ్‌ 79/1తో మంచి స్థితిలో నిలిచి విజయంపై కన్నేసింది. ఆ జట్టు గెలవాలంటే చివరి రెండు సెషన్లలో 205 పరుగులు చేయాలి. భారత్‌ విజయం సాధించాలంటే కివీస్‌ జట్టు ఆలౌట్‌ కావాలి. కాగా, కివీస్‌ వికెట్లు తీసేందుకు రహానె అటు స్పిన్నర్లను, ఇటు పేసర్లను వినియోగించినా ఫలితం లేకుండా పోయింది. నాలుగో రోజు ఆఖరి నిమిషాల్లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ విల్‌యంగ్‌ (2) అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని