Viral Video: ఊహించని గిఫ్ట్.. చిన్నారి కన్నీటి పర్యంతం
ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాడు మాసన్ మౌంట్ నెటిజెన్ల మనసులు కొల్లగొట్టాడు. తాజాగా జరిగిన యూరోకప్ 2020 సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్.. డెన్మార్క్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే...
మనసులు గెలిచిన ఇంగ్లాండ్ ఆటగాడు
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ ఆటగాడు మాసన్ మౌంట్ నెటిజెన్ల మనసు కొల్లగొట్టాడు. తాజాగా జరిగిన యూరోకప్ 2020 సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్.. డెన్మార్క్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ జట్టు 55 ఏళ్ల తర్వాత ఓ పెద్ద టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే ఇంగ్లిష్ జట్టు ఆటగాడు మాసన్ ఓ చిన్నారి అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోయే బహుమతి ఇచ్చాడు. దాంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.
డెన్మార్క్‌తో విజయం సాధించాక ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, అదే సమయంలో ఆ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ చిన్నారిని చూసిన మాసన్ స్టాండ్స్‌లో నిల్చున్న ఆమె వద్దకు వెళ్లి తన జెర్సీని గుర్తుగా ఇచ్చాడు. తాను ఎంతగానో ఇష్టపడే ఫుట్‌బాల్ టీమ్ ఆటగాడు స్వయంగా జెర్సీని బహుమతిగా ఇవ్వడంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనైంది. సంతోషం పట్టలేక తన తండ్రిని హత్తుకొని ఆనందబాష్పాలు కార్చింది. దాంతో అక్కడున్న వారంతా ఆ చిన్నారికి, ఆమె తండ్రికి అభినందనలు తెలిపారు. ఆ వీడియోను ఒక వ్యక్తి తొలుత సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ఇంగ్లాండ్ టీమ్ దాన్ని తమ ట్విటర్లో పోస్టు చేసింది. కాగా, ఆ వీడియో పోస్టు చేసిన 24 గంటల్లోనే 71 లక్షల మందికిపైగా వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!