Jhulan Goswami: ఝులన్‌కు వీడ్కోలు.. ఏడ్చేసిన కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌

టీమ్‌ఇండియా మహిళా క్రికెట్‌ జట్టు సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి తన సుదీర్ఘ ప్రయాణం నేటితో ముగియనుంది. కెరీర్‌లో నేడు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతోంది.........

Published : 25 Sep 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా క్రికెట్‌ జట్టు సీనియర్‌ పేసర్‌ ఝులన్‌ గోస్వామి తన సుదీర్ఘ క్రికెట్‌ ప్రయాణం నేటితో ముగియనుంది. కెరీర్‌లో నేడు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతోంది. ఈ వీడ్కోలు మ్యాచ్‌కి ముందు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కంటతడి పెట్టింది. లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డే టాస్‌కి ముందు జట్టు సభ్యులు ఝులన్‌ గురించి మాట్లాడి ఆమెకు జ్ఞాపికలు అందజేశారు. ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో సీనియర్‌ పేసర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హర్మన్‌ ప్రీత్‌ భావోద్వేగానికి గురై ఝులన్‌ను హత్తుకొని కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గోస్వామితోపాటు బీసీసీఐ మహిళా అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఝులన్ కెప్టెన్సీలోనే హర్మన్‌ అరంగేట్రం చేయడం విశేషం.

తన రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో.. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసింది ఝులన్‌. 12 టెస్టుల్లో 44 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె 204 వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మరే ఇతర బౌలర్‌ కూడా ఆమె దరిదాపుల్లో లేరు. మరెవరూ 200 మార్కును దాటలేదు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (43) తీసిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని