Rohit Sharma:రోహిత్‌ వచ్చేశాడు

వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు   సెలక్షన్‌ కమిటీ బుధవారం భారత జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్లను నడిపించనున్నాడు. రాజస్థాన్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపక్‌ హుడాకు వన్డే పిలుపు అందింది.

Updated : 27 Jan 2022 06:56 IST

వెస్టిండీస్‌తో పోరుకు భారత జట్ల ఎంపిక
టీ20 జట్టులో రవి బిష్ణోయ్‌
దీపక్‌ హుడాకు వన్డేల్లో ఛాన్స్‌
బుమ్రా, షమికి విశ్రాంతి  

ముంబయి: వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు   సెలక్షన్‌ కమిటీ బుధవారం భారత జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్లను నడిపించనున్నాడు. రాజస్థాన్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపక్‌ హుడాకు వన్డే పిలుపు అందింది. దక్షిణాఫ్రికాలో స్పిన్నర్ల వైఫల్యం నేపథ్యంలో 21 ఏళ్ల లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్‌ జడేజా సెలక్షన్‌కు అందుబాటులో లేడు. హార్దిక్‌ పాండ్య కూడా ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. ఫాస్ట్‌బౌలర్లు బుమ్రా, షమిలకు విశ్రాంతి కల్పించారు. కేఎల్‌ రాహుల్‌ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉంటాడు.  భువనేశ్వర్‌కు టీ20 జట్టులో మాత్రమే స్థానం లభించింది. అశ్విన్‌ ఏ జట్టులోనూ లేడు. వెస్టిండీస్‌తో వన్డేలు ఫిబ్రవరి 6, 9, 11న అహ్మదాబాద్‌లో, టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలో జరుగుతాయి.

భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌, ధావన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, శ్రేయస్‌, దీపక్‌ హుడా, పంత్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌

భారత టీ20 జట్టు: రోహిత్‌, రాహుల్‌, కిషన్‌,  కోహ్లి, శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, వెంకటేశ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌, బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, సుందర్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌, అవేష్‌, హర్షల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని