సెమీస్‌లో సింధు

సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు 11-21, 21-12, 21-17తో సుపనిద (థాయ్‌లాండ్‌)పై విజయం

Published : 22 Jan 2022 03:45 IST

గాయత్రి జోడీ ముందంజ
సయ్యద్‌ మోదీ టోర్నీ

లఖ్‌నవూ: సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ సూపర్‌ 300 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌ సింధు 11-21, 21-12, 21-17తో సుపనిద (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. 65 నిమిషాల పాటు సాగిన పోరులో సింధుకు సుపనిద గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్‌లో ఓడిన సింధు.. తన అనుభవాన్నంతా ఉపయోగించి తర్వాతి రెండు గేమ్‌ల్ని సొంతం చేసుకుంది. సెమీస్‌లో ఎగెనియా కొసెత్సకయా (రష్యా)తో సింధు తలపడనుంది. మాళవిక బాన్సోద్‌ 21-11, 21-11తో ఆకర్షి కశ్యప్‌పై, అనుపమ ఉపాధ్యాయ 24-22, 23-21తో సామియా ఇమాద్‌ ఫారూఖీపై నెగ్గి సెమీస్‌ చేరుకున్నారు. అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ప్రణయ్‌ 19-21, 16-21తో ఆర్నాడ్‌ మెర్కెల్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. మంజునాథ్‌ 11-21, 21-12, 21-18తో సెర్గీ సిరాంత్‌ (రష్యా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ జోడీ సెమీస్‌ చేరుకుంది. క్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 24-22, 21-10తో అనస్తేసియా- ఓల్గా (రష్యా) జంటపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అర్జున్‌- ట్రీసా 24-22, 21-17తో విలియమ్‌- ట్రాన్‌ (ఫ్రాన్స్‌)పై, ఇషాన్‌- తనిషా 21-13, 21-19తో ఆశిత్‌- ప్రాంజల్‌పై, అక్షాన్‌- సిమ్రన్‌ 21-15, 22-20తో బాలకేసరి- శ్వేతపర్ణాపై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించారు. హేమ నాగేంద్రబాబు- శ్రీవేద్య గురజాడ జోడీకి క్వార్టర్స్‌లో వాకోవర్‌ లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని