క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో

Published : 21 Jan 2022 01:57 IST

లఖ్‌నవూ: భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ సింధు 21-16, 21-13తో లారెన్‌ లామ్‌ (అమెరికా)పై విజయం సాధించింది. సామియా ఇమాద్‌ ఫారూఖీ 21-6, 21-15తో కనిక కన్వల్‌పై, ఆకర్షి కశ్యప్‌ 21-9, 21-6తో చుక్కా సాయి ఉత్తేజితరావుపై, మాళవిక బాన్సోద్‌ 21-10, 21-8తో ప్రేరణపై, అనుపమ ఉపాధ్యాయ 21-12, 21-19తో స్మిత్‌ తోష్నివాల్‌పై నెగ్గి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌ 21-11, 16-21, 21-18తో ప్రియాంషు రజావత్‌పై, మిథున్‌ మంజునాథ్‌ 16-21, 21-16, 23-21తో సూంగ్‌ వెన్‌ (మలేసియా)పై గెలిచి ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో కృష్ణప్రసాద్‌- విష్ణువర్ధన్‌గౌడ్‌ 15-21, 21-17, 21-8తో నూర్‌ అయుబ్‌- లిమ్‌ వా (మలేసియా)పై, ఇషాన్‌- సాయి ప్రతీక్‌ 21-17, 21-17తో శ్యామ్‌ ప్రసాద్‌- సుంజిత్‌పై గెలుపొందారు. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ 21-12, 21-7తో సిమ్రన్‌- రితికపై, శ్రుతి ముందాడ- తనిష్క 21-12, 21-13తో రుద్రాణి- అనీస్‌ కొశ్వార్‌పై, హరిత- ఆష్నా 21-18, 21-10తో మణిదీప- ఉత్సవపై విజయం సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అర్జున్‌- ట్రీసా జాలీ 21-9, 21-17తో సుంజిత్‌- మెహ్రీన్‌పై, ఇషాన్‌- తనిషా 21-14, 26-24తో సాయి ప్రతీక్‌- గాయత్రి గోపీచంద్‌ పుల్లెలపై, అక్షాన్‌శెట్టి- సిమ్రన్‌ 21-3, 21-10తో కశిష్‌- సారునిపై నెగ్గి క్వార్టర్స్‌ చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని