KL Rahul: లఖ్‌నవూ సారథిగా కేఎల్‌రాహుల్‌

ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు. వచ్చేనెలలో బెంగళూరులో ఆటగాళ్ల మెగా వేలానికి ముందు లఖ్‌నవూ ఎంపిక చేసుకున్న ముగ్గురిలో రాహుల్‌ ఒకడని

Updated : 19 Jan 2022 07:19 IST

దిల్లీ: ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ లఖ్‌నవూకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహించనున్నాడు. వచ్చేనెలలో బెంగళూరులో ఆటగాళ్ల మెగా వేలానికి ముందు లఖ్‌నవూ ఎంపిక చేసుకున్న ముగ్గురిలో రాహుల్‌ ఒకడని తెలుస్తోంది. మిగతా ఇద్దరిలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయ్‌నిస్‌, లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ఉండే అవకాశం ఉంది. రాహుల్‌కు రూ.15 కోట్లు, స్టాయ్‌నిస్‌కు రూ.11 కోట్లు, బిష్ణోయ్‌కు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘‘లఖ్‌నవూకు రాహుల్‌ సారథ్యం వహిస్తాడు. మిగతా ఇద్దరు ఆటగాళ్ల ఎంపికపై జట్టు నిర్ణయం తీసుకోనుంది’’ అని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. గత రెండు సీజన్‌లలో పంజాబ్‌ కింగ్స్‌కు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. పంజాబ్‌కు బిష్ణోయ్‌, దిల్లీ క్యాపిల్స్‌కు స్టాయ్‌నిస్‌ ప్రాతినిధ్యం వహించారు.

పూర్తి స్థాయి కెప్టెన్సీ గురించి ఆలోచించట్లేదు: టీమ్‌ఇండియా పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌ కావడం గురించి తాను ఆలోచించట్లేదని వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. అవకాశం వస్తే మాత్రం సాధ్యమైనంత మెరుగ్గా జట్టును నడిపిస్తానని చెప్పాడు. ‘‘జట్టుకు నాయకత్వం వహించడం అంటే ఏ ఆటగాడికైనా కల నిజం కావడమే. నాకు కూడా అంతే. ప్రస్తుతానికైతే నేను దేని గురించీ ఆలోచించట్లేదు. కెప్టెన్సీ వస్తే మాత్రం భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి నా శక్తి మేర చేయాల్సిందంతా చేస్తా’’ అని రాహుల్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని