టీఎన్‌పీఎల్‌లో ఫిక్సింగ్‌ చేయమన్నారు: ఆర్‌.సతీశ్‌

తమిళనాడు ప్రిమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేయాల్సిందిగా తనకు ప్రతిపాదన వచ్చిందని ఫస్ట్‌క్లాస్‌, ఐపీఎల్‌ మాజీ ఆటగాడు రాజగోపాల్‌ సతీశ్‌ తెలిపాడు. సామాజిక మాధ్యమం వేదికగా

Published : 19 Jan 2022 02:39 IST

దిల్లీ: తమిళనాడు ప్రిమియర్‌ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేయాల్సిందిగా తనకు ప్రతిపాదన వచ్చిందని ఫస్ట్‌క్లాస్‌, ఐపీఎల్‌ మాజీ ఆటగాడు రాజగోపాల్‌ సతీశ్‌ తెలిపాడు. సామాజిక మాధ్యమం వేదికగా బన్ని ఆనంద్‌ అనే వ్యక్తి తనను సంప్రదించినట్లు చెప్పాడు. టీఎన్‌పీఎల్‌లో గత సీజన్‌లో విజేతగా నిలిచిన చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టులో 41 ఏళ్ల సతీశ్‌ సభ్యుడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఈ తమిళనాడు మాజీ ఆటగాడు ప్రాతినిధ్యం వహించాడు. ‘‘సామాజిక మాధ్యమం ద్వారా డబ్బులు ఇవ్వజూపినట్లుగా మాతో పాటు ఐసీసీకి ఈనెల మొదట్లో సతీశ్‌ సమాచారం అందించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సతీశ్‌కు సూచించాం. అతను ఆ పని చేశాడు. ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతుంది’’ అని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధిపతి షాబిర్‌ ఖండ్వాలా తెలిపాడు. బెంగళూరు పోలీసులకు సతీశ్‌ ఫిర్యాదు చేశాడు. నిరుడు జులై 19 నుంచి ఆగస్టు 15 వరకు టీఎన్‌పీఎల్‌ జరిగింది. ‘‘సతీశ్‌ ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణాల్ని పోలీసులు విశ్లేషిస్తారు. అతణ్ని మేం నిరుత్సాహపరచదల్చుకోలేదు. సతీశ్‌ బయటకు రావాలని నిర్ణయించుకుంటే అతనికి మార్గం చూపడం మా కర్తవ్యం’’ అని షాబిర్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని