Smriti Mandhana: బిగ్‌బాష్‌లో మందాన రికార్డు స్కోరు
టీమ్ఇండియా బ్యాటర్ స్మృతి మందాన (114 నాటౌట్; 64 బంతుల్లో 14×4, 3×6) మహిళల బిగ్‌బాష్ (డబ్ల్యూబీబీఎల్)లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన మందాన..
మకాయ్: టీమ్ఇండియా బ్యాటర్ స్మృతి మందాన (114 నాటౌట్; 64 బంతుల్లో 14×4, 3×6) మహిళల బిగ్‌బాష్ (డబ్ల్యూబీబీఎల్)లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన మందాన.. డబ్ల్యూబీబీఎల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు (ఆష్లీ గార్డెనర్- ఆస్ట్రేలియా) ఘనతను సమం చేసింది. అయితే సిడ్నీ థండర్స్ ఓటడంతో మందాన పోరాటం వృథా అయింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 4 పరుగుల ఆధిక్యంతో సిడ్నీ థండర్స్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (81 నాటౌట్; 55 బంతుల్లో 11×4, 2×6) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తాచాటింది. అనంతరం సిడ్నీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 171 పరుగులు చేయగలిగింది. బ్యాటింగ్‌లో సత్తాచాటిన హర్మన్ (1/27) బౌలింగ్‌లోనూ రాణించి మెల్బోర్న్కు విజయాన్ని అందించింది. సిడ్నీ విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సిన సమయంలో హర్మన్ బౌలింగ్ చేసి 9 పరుగులే ఇచ్చింది. దీంతో మందాన రికార్డు స్కోరు సాధించినా సిడ్నీకి విజయం దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్