Lora Webster: 5 నెలల గర్భంతో ఆడేస్తోంది

గర్భం దాల్చిన మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ..

Published : 03 Sep 2021 10:36 IST

టోక్యో: గర్భం దాల్చిన మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటూ.. పౌష్టిక ఆహారం తింటూ.. రోజులు గడుపుతారు. కానీ అయిదు నెలల గర్భంతో ఉన్న మహిళ పారాలింపిక్స్‌లో పాల్గొంటే.. చురుగ్గా వాలీబాల్‌ ఆడుతుంటే ఎలా ఉంటుంది? ఇది నమ్మశక్యంగా లేదు కదా! కానీ అమెరికా పారా అథ్లెట్‌ లోరా వెబ్‌స్టర్‌ అయిదు నెలల కడుపుతో టోక్యోలో అడుగుపెట్టి.. తన అయిదో పారాలింపిక్స్‌ పతకం కోసం కోర్టులో ఆడేస్తోంది. ఇలా గర్భవతిగా ఉన్న సమయంలో పోటీల్లో పాల్గొనడం ఆమెకు కొత్తమీ కాదు. గతంలోనూ ఓ సారి ఇలా పారాలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె.. నాలుగో బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. 11 ఏళ్ల వయసులో ఎముకల క్యాన్సర్‌ కారణంగా తన ఎడమ కాలు దెబ్బతింది. దీనికి శస్త్రచికిత్స చేయించుకుంది. చికిత్సలో భాగంగా తన ఎడమ కాలి మధ్యలో భాగాన్ని తీసేసి చీలమండ కీలును పైకి జరిపి దాన్ని 180 డిగ్రీల కోణంలో తిప్పి మోకాలిని మార్పిడి చేశారు. దీంతో కాలు కుచించుకుపోయినట్లు కనిపించి పాదం వెనక్కి తిరిగి ఉంటుంది. కృత్రిమ కాలు సాయంతో ఆమె ఇప్పుడు నడవగలదు. కూర్చుని ఆడే పారా వాలీబాల్‌లో తొలిసారి 2004 ఏథెన్స్‌ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించిన ఆమె అప్పుడు కాంస్యం గెలిచింది. 2008, 2012ల్లో రజతాలు సొంతం చేసుకున్న తను.. గత రియో పారాలింపిక్స్‌లో పసిడి ముద్దాడింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని