IND vs NZ: అక్షర్ ఐదు వికెట్ల ప్రదర్శన.. భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
భారీ స్కోరు సాధిస్తుందేమోనని భావించిన కివీస్‌ను కట్టడి చేయడంలో టీమ్ఇండియా బౌలర్లు తీవ్రంగా కష్టపడ్డారు. పిచ్ నుంచి సరైన...
ఇంటర్నెట్ డెస్క్: భారీ స్కోరు సాధిస్తుందేమోనని భావించిన కివీస్‌ను కట్టడి చేయడంలో టీమ్ఇండియా బౌలర్లు విజయవంతమయ్యారు. పిచ్ నుంచి సరైన సహకారం లభించకపోయినా స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో భారత్‌కు స్వల్ప ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. రెండో రోజు కాస్త వెనుకడుగు వేసినట్లు అనిపించిన టెస్టులో మళ్లీ టీమ్ఇండియా పట్టు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు రాణించి కివీస్‌కు మంచి లక్ష్యాన్ని నిర్దేశించగలిగితే విజయం కోసం ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉంటాయి.
రెండో రోజు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన కివీస్ బ్యాటర్లు మూడో రోజు తలొగ్గారు. యువ స్పిన్పర్ అక్షర్ పటేల్ (5/62), అశ్విన్ (3/82) దెబ్బకు న్యూజిలాండ్ కుదేలైంది. అక్షర్ పడగొట్టిన ఐదు వికెట్లలో రెండు బౌల్డ్‌లు, రెండు స్టంపౌట్లు, ఒక ఎల్బీడబ్ల్యూ ఉండటం విశేషం. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 49 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓపెనర్లు టామ్ లేథమ్ (95), విల్ యంగ్ (89) శతకం చేసే అవకాశాలను చేజార్చుకున్నారు. ఆఖర్లో జేమీసన్ (75 బంతుల్లో 23) భారత బౌలర్లకు కాసేపు విసుగు తెప్పించినా కివీస్‌కు మాత్రం ఆధిక్యం దక్కేలా చేయలేకపోయాడు. వీరు ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేన్ విలియమ్సన్ 18, రాస్ టేలర్ 11, నికోల్స్ 2, టామ్ బ్లండెల్ 13, రచిన్ రవీంద్ర 13, సౌథీ 5, సోమర్విల్లే 6, అజాజ్ పటేల్ 5* పరుగులు చేశారు. భారత బౌలర్లలో అక్షర్ 5, అశ్విన్ 3.. జడేజా, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
ఐపీఎల్-2024లో రికార్డు ఛేజింగ్‌తో కోల్‌కతాపై పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. -
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్‌కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్‌రేట్‌పై గావస్కర్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్‌లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM