Euro cup: 55 ఏళ్ల తర్వాత తొలిసారి ఫైనల్‌కు ఇంగ్లాండ్‌

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 2-1 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్‌

Updated : 09 Jul 2021 00:35 IST

లండన్‌: యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌ అదరగొట్టింది. రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 2-1 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్‌ టోర్నీలో సెమీస్‌ను దాటి ఫైనల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే తుదిపోరులో ఇటలీని ఢీకొట్టనుంది. 1966 ప్రపంచకప్‌ తర్వాత సెమీస్‌లో ఇంగ్లాండ్ గెలవడం ఇదే తొలిసారి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి నుంచి ఇంగ్లాండే ఆధిపత్యం ప్రదర్శించింది. 30వ నిమిషంలో డెన్మార్క్‌ ఆటగాడు డ్యామ్స్‌గార్డ్‌ ఫ్రీ కిక్‌ను అద్భుతంగా గోల్‌చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే డెన్మార్క్‌ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లాండ్‌ స్కోర్‌ను సమం చేసింది. దీంతో నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌ చేసి సమంగా నిలవడంతో ఆట ఆదనపు సమయానికి దారితీసింది. ఆదనపు సమయంలో ఇంగ్లాండ్‌ అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆ జట్టు ఆటగాడు హారీ కేన్‌ పెనాల్టీ కిక్‌ను డెన్మార్క్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నప్పటికీ,  బంతి గోలోపోస్ట్‌ దగ్గరలోనే పడడంతో  అక్కడే ఉన్న కేన్‌ గోల్‌ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.  డెన్మార్క్‌ పోరాడినా మరో గోల్‌ చేయలేకపోయింది. దీంతో ఆ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టీమ్‌ 10 సార్లు గోల్‌ లక్ష్యం దిశగా వెళ్లగా, డెన్మార్క్‌ కేవలం మూడు సార్లు మాత్రమే వెళ్లింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని