Virat Kohli:‘కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి అదీ ఒక కారణం’

కొన్ని రోజుల కిందట విరాట్ కోహ్లీ భారత టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి  అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే, టీ20లు, వన్డేల్లో నాయకత్వ బాధ్యతలు లేకపోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌లోనైనా

Published : 21 Jan 2022 01:52 IST

పార్ల్‌: కొన్ని రోజుల కిందట విరాట్ కోహ్లీ భారత టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. అయితే, టీ20లు, వన్డేల్లో నాయకత్వ బాధ్యతలు లేకపోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌లోనైనా కోహ్లీ మరికొన్నాళ్లు కెప్టెన్‌గా కొనసాగుతాడని అంతా భావించారు. అతడు ఇలా అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి గల కారణాలపై క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఓడిపోవడంతోనే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని పలువురు భావిస్తున్నారు. ఈ అంశంపై దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్ స్టెయిన్‌ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బయో బబుల్స్ కారణంగా, తన కుటుంబానికి అండగా ఉండేందుకు విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని స్టెయిన్‌ పేర్కొన్నాడు.

‘విరాట్‌ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడంలో బయో బబుల్స్‌ పాత్ర కూడా ఉండొచ్చు. అతడికి ప్రస్తుతం యంగ్‌ ఫ్యామిలీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా ఉండటం ఇబ్బందికరంగా ఉంటుంది. కెప్టెన్సీ అనేది నిస్వార్థ విషయం. జట్టు ఉత్తమమైన  ఫలితాలు సాధించేందుకు బృందంలోని ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు కృషిచేయాలి. కానీ, మన జీవితంలోకి ఇతర వ్యక్తులు వచ్చినప్పుడు (భార్య, పిల్లలు) ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు కెప్టెన్సీ నుంచి వైదొలగిన విరాట్ తన కుటుంబం, బ్యాటింగ్‌పై దృష్టిసారిస్తాడు. త్వరలోనే  విరాట్ కోహ్లీ ఆటతీరు మెరుగవడం మీరూ చూడొచ్చు’ అని స్టెయిన్ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని