T20 World Cup: మ్యాక్సీ.. ఆ షాట్‌ పేరేంటో చెబుతావా?: ఐసీసీ

నెట్‌ప్రాక్టీస్‌ సందర్భంగా వెరైటీ షాట్ ఆడిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ 

Updated : 28 Oct 2021 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: స్విచ్‌ హిట్స్‌తో అలవోకగా బౌండరీలు బాదే బ్యాటర్లలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (Glenn Maxwell) ముందుంటాడు. రిస్కీ షాట్లను ఆడేందుకు ఏమాత్రం ఆలోచించడు. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టులో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో. కీలకమైన సమయంలో ఇటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌తోనూ.. అటు ఆఫ్‌స్పిన్నర్‌గా బౌలింగ్‌లోనూ ఆసీస్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. మొన్నటి వరకు ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అదరగొట్టిన మ్యాక్సీ.. టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) తొలి మ్యాచ్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ (18 పరుగులు, 1/24)  ఫర్వాలేదనిపించాడు.

గురువారం ఆసీస్‌ తన రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొట్టబోతోంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. మైదానంలో విభిన్న షాట్లను ఆడే మ్యాక్స్‌వెల్ నెట్‌ ప్రాక్టీస్‌లోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. స్కూప్‌, రివర్స్‌ స్వీప్‌నే కాకుండా ఓ ప్రత్యేకమైన షాట్‌ను ఆడిన వీడియోను ICC సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘‘ఈ షాట్‌ను ఏమని పిలుస్తావు.. మ్యాక్సీ?’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. లెగ్‌సైడ్‌ వైడ్‌గా వచ్చిన బంతిని వదిలేయకుండా ఒక్కసారిగా కాళ్ల వెనుకవైపు నుంచి షాట్ కొట్టేందుకు మ్యాక్సీ ప్రయత్నించాడు. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని