IND vs NZ: అశ్విన్ లాంటి ఓ బౌలర్ జట్టులో ఉండాలి : రోహిత్‌ శర్మ

చాలా ఏళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో చోటు దక్కించుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడని టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మధ్య ఓవర్లలో పరుగుల వరదను..

Published : 22 Nov 2021 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలా ఏళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో చోటు దక్కించుకున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడని టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మధ్య ఓవర్లలో పరుగుల వరదను ఆపాలన్నా.. కీలక సమయాల్లో వికెట్లు తీయాలన్నా.. అశ్విన్‌ లాంటి ఓ బౌలర్‌ జట్టులో ఉండాలని అన్నాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అశ్విన్‌ పునరాగమనాన్ని ఘనంగా ప్రారంభించాడు. మధ్య ఓవర్లలో పరుగులను కట్టడి చేస్తూనే.. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. అతడు చాలా ఏళ్లుగా టెస్టుల్లో సత్తా చాటుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా మంచి రికార్డే ఉంది. అతడో గొప్ప బౌలర్’ అని రోహిత్ శర్మ అన్నాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచులు ఆడిన అశ్విన్‌ మూడు వికెట్లు తీశాడు. 

‘టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్, టీ20 కెప్టెన్‌గా నేను బాధ్యతలు చేపట్టాక జట్టులో ఆరోగ్యకర వాతావరణం ఉండేలా చూశాం. ఆటగాళ్లు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాం. ఒకవేళ ఎవరైనా విఫలమైనా మీ వెంట మేమున్నామనే భరోసా కల్పించాం. ఈ సిరీస్‌ విజయంలో బౌలర్లు కీలకంగా వ్యవహరించారు. బలమైన బ్యాటింగ్‌ లైనప్ ఉన్న న్యూజిలాండ్ జట్టును మోస్తరు పరుగులకే పరిమితం చేయడం మాకు కలిసొచ్చింది’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని