Published : 13/11/2020 23:58 IST

యువీ..! ఎందుకంత క్యూట్‌గా ఉన్నావ్?

మాజీ ఆల్‌రౌండర్‌పై కెవిన్‌ పీటర్సన్‌ వ్యాఖ్య

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఎందుకంతా క్యూట్‌గా ఉన్నావంటూ ఎప్పుడూ అతడితో మాటల యుద్ధం చేసే ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ వ్యాఖ్యానించాడు. తాజాగా యువరాజ్‌ దుబాయ్‌లోని ప్రతిష్ఠాత్మక బూర్జ్‌ ఖలీఫా ఎదుట నిలబడి పలు ఫొటోలు తీసుకున్నాడు. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా పీటర్సన్‌ పైవిధంగా స్పందించాడు. కాగా, ఆ ఫొటోల్లో మాజీ ఆల్‌రౌండర్‌ నిజంగానే అందంగా ఉన్నాడు. తెల్ల టీషర్ట్‌, బ్లూ జీన్స్‌కు తోడు కళ్లజోడు ధరించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.

గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్‌ ప్రస్తుతం ఇతర దేశాల్లో జరిగే లీగుల్లో ఆడాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే పంజాబ్‌ దేశవాళి జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా కొనసాగాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు. మరోవైపు యువరాజ్‌, పీటర్సన్‌ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో పరస్పరం సెటైర్లు వేసుకోవడం తెలిసిందే. ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లోని మాంచెస్టర్‌, చెల్సీ జట్లకు అభిమానులైన వీరు అవి పోటీపడ్డప్పుడల్లా మాటల యుద్ధానికి దిగుతారు. ఈ క్రమంలోనే పీటర్సన్‌ ఇప్పుడు యువీని పొగడటం గమనార్హం. 


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని