నిద్రమత్తులో టీమిండియా స్కోర్‌ 369 అనుకున్నా..!

ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘోర పరాభవం పాలవ్వడంపై పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లు షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ అక్తర్‌ స్పందించారు. ఆస్ట్రేలియా బౌలర్లు పాట్‌ కమిన్స్‌...

Updated : 20 Dec 2020 13:20 IST

అక్తర్‌ వెక్కిరింపు

కోహ్లీ లేకుండా కష్టమే: అఫ్రిది

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘోర పరాభవం పాలవ్వడంపై పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లు షాహిద్‌ అఫ్రిది, షోయబ్‌ అక్తర్‌ స్పందించారు. ఆస్ట్రేలియా బౌలర్లు పాట్‌ కమిన్స్‌ 4/21, జోష్‌ హాజిల్‌వుడ్‌ 5/8 అద్భుతంగా బౌలింగ్‌ చేశారన్నారు. చాలా కాలం తర్వాత అసలైన టెస్టు బౌలింగ్‌ చూశానని అఫ్రిది పేర్కొన్నాడు. అయితే, టీమ్‌ఇండియా కోలుకునే అవకాశం ఉందన్నాడు. కానీ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేకుండా అది కష్టమని ట్వీట్ చేశాడు. 

మరోవైపు అక్తర్‌ ట్వీట్‌ చేస్తూ కోహ్లీ సేనను గేలిచేశాడు. శనివారం నిద్రలేచి చూసేసరికి టీమ్‌ఇండియా స్కోర్‌ 369గా కనిపించిందని, అది నమ్మలేకపోయానని అన్నాడు. తర్వాత తేరుకొని చూస్తే అది 36/9 అని స్పష్టమైందని చెప్పాడు. ఇది కూడా తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. టీమ్‌ఇండియా అంత తేలిగ్గా ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోదని అన్నాడు. ఇక్కడి నుంచి చాలా బలంగా పుంజుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు. అయితే, 2013లో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్‌ సాధించిన 49 అత్యల్ప టెస్టు స్కోరును టీమ్‌ఇండియా అధిగమించడం తనకు సంతోషంగా ఉందన్నాడు. ఇది చాలా ఘోరమైన ప్రదర్శన అని, ఏదేమైనా క్రికెట్‌లో ఇలాంటివి చోటు చేసుకుంటాయని అక్తర్‌ పేర్కొన్నాడు. ఇది భారత్‌కు మంచిది కాదన్నాడు. ఈ ప్రదర్శన పట్ల వచ్చే విమర్శలు, అవమానాన్ని భరించక తప్పదన్నాడు.

ఇవీ చదవండి..

36.. పరువు కంగారు పాలు

98444421000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని