Published : 17/07/2020 19:41 IST

రియల్‌ మాడ్రిడ్‌ గెలుపుపై రోహిత్‌ హర్షం

ఇంటర్నెట్‌డెస్క్‌: స్పానిష్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ లా లిగాలో రియల్‌ మ్యాడ్రిడ్‌ మరోసారి విజేతగా నిలవడంతో టీమ్‌ఇండియా ఓపెనర్‌, పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. గురువారం విల్లారియల్‌ జట్టుతో తలపడిన టైటిల్‌ పోరులో రియల్‌ మ్యాడ్రిడ్ 2-1 తేడాతో‌ గెలుపొందింది. దీంతో లా లిగా లీగ్‌లో ఆ జట్టు 34వ సారి అత్యధిక టైటిల్స్‌ సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని రోహిత్‌ శర్మ శుక్రవారం ఆ జట్టుకు అభినందనలు చెప్పాడు. ట్విటర్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. 

‘రియల్‌ మ్యాడ్రిడ్‌ బ్యాగ్‌లో ఇంకో విజయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ జట్టు కలిసికట్టుగా ఆడి విజయం సాధించింది. అందరికీ అభినందనలు. మొత్తానికి ఈ ఏడాదిలో ఓ శుభవార్త విన్నాం’ అని హిట్‌మ్యాన్‌ ట్వీట్‌ చేశాడు. అందులో తాను ఆనందంగా నవ్వుతూ చేయి పైకెత్తిన ఫొటోను పంచుకున్నాడు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఆరంభంలో రోహిత్‌ తన సతీమణి రితికతో కలిసి స్పానిష్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రియల్‌ మ్యాడ్రిడ్‌ సొంత మైదానాన్ని సైతం పరిశీలించాడు. అప్పుడు దిగిన ఫొటోలను కూడా హిట్‌మ్యాన్‌‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో హిట్‌మ్యాన్‌ న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా గాయపడగా మధ్యలోనే అక్కడి నుంచి వచ్చేశాడు. తర్వాత తిరిగి కోలుకోవడంతో ఐపీఎల్‌లో చెలరేగుతాడని అంతా ఆశించారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా ఆ మెగా టోర్నీ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా, రోహిత్‌ ఇటీవలే లాక్‌డౌన్‌ నుంచి బయటకు వచ్చి స్థానిక మైదానంలో ప్రాక్టీస్‌ మొదలెట్టినట్లు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటో కూడా పంచుకున్నాడు. 


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని